నకిలీ బంగారు బిస్కట్స్ ను అసలు బంగారు బిస్కట్స్ నమ్మించి అమ్మడానికి ప్రయత్నిస్తున్న 3 సభ్యుల ముఠా ను ఎస్ ఓ టి బాలానగర్ టీం మరియు జీడిమెట్ల పోలీసులు పట్టుకుని వారి వద్దనుండి 100 నకిలీ బంగారు బిస్కట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటిని కొనడానికి 27 లక్షలు సమకూర్చుకుని వచ్చిన వారు కూడా వారితో ఉన్నారు. అదే సమయంలో ఎస్ ఓ టి పోలీసులు దాడి చేసి ముఠాను పట్టుకోడం తో కొనడానికి వచ్చిన బాధితులు పెద్ద మొత్తం లో డబ్బు పోకుండా రక్షించినదుకు ఎస్ ఓ టి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ముఠా సభ్యులు ఇంతకు ముందు కూడా ఇలాంటి నేరాలకు పాటుపడం జరిగింది.యాశాల కామేశ్వర రావు, సరస్వతి నగర్ ఉప్పల్ వేముల పుల్లా రావు, గోరంట్ల, గుంటూరు బత్తుల సాంబశివరావు, నాగిరెడ్డి పాలెం బెల్లంకొండ గుంటూరు.
ఈ ముఠా ఇంకా ఎంతమందిని మోసం చేసింది అనే కోణం లో పోలీసు విచారిస్తున్నట్లు తెలుస్తుంది.