33.2 C
Hyderabad
April 26, 2024 02: 01 AM
Slider కరీంనగర్

వేములవాడ మండలంలో కార్డన్ అండ్ సెర్చ్

carden and scerch

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే  ఆదేశాల మేరకు బుధవారం వేములవాడ మండలం  అచ్చన్న పేట గ్రామములో వేములవాడ డిఎస్పీ చంద్రకాంత్ కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

వేములవాడ మండలం లోని అచ్చన్నపేట గ్రామంలో పోలీసులు ఈ రోజు సాయంత్రం  కార్డెన్ సర్చ్ నిర్వహించారు. పోలీస్ లు సాయంత్రం సమయంలో  గ్రామన్ని చుట్టుముట్టి ప్రతి ఇల్లును తనిఖీ చేశారు. కుటుంబ సభ్యుల వివరాలు వాహనాల ధృవ పత్రాలు పరిశీలించారు. సరిగా ధ్రువీకరణ పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం కూడలిలో ప్రజలకి చట్టాల పై అవగాహన కల్పించారు. కాలనీ లోకి వచ్చిన నూతన వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారి సమాచారం పోలీస్ లకు అందించాలని ఆయన సూచించారు. సి సి కెమెరాలా ఏర్పాటుతో నేరాలు దొంగతనాలు అరికట్టవచని కాలనీలో ప్రశాంత వాతావరణం  నెలకొంటుందని చెప్పారు.

వాహనదారులు డ్రైవింగ్ భీమా  ఆర్.సి పొల్యూసన్ తదితర ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండటంతో ప్రమాదాలు జరిగిన సమయం లో లబ్ధి చేకూరుతుందని  సూచించారు. ఈ కార్యక్రమంలో లో  వేములవాడ రూరల్ సి. ఐ నవీన్ కుమార్, చందుర్తి సి. ఐ వెంకటేష్, ఎస్.ఐ లు ఉపేందర్ రెడ్డి, మాలకొండ రాయుడు, సౌమ్య , శ్రీనివాస్, సునీల్, పర్శరాములు, దివ్యభారతి ఏఎస్.ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మావోయిస్టు సుదర్శన్‌ కూడా లొంగిపోతాడా?

Satyam NEWS

డిబేటబుల్: సంచయిత అసుసరిస్తున్న మతం ఏది?

Satyam NEWS

జాతీయ అవార్డు పొందిన సర్పంచ్ లకు సీఎం అభినందన

Satyam NEWS

Leave a Comment