విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో విజయనగరం డీఎస్పీ గోవిందరావు, వన్ టౌన్ సీఐ డా. వెంకటరావులు విజయనగరం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో కార్డాన్ సెర్చ్ చేపట్టారు. దాదాపు యాభై మంది సిబ్సందితో అడుగడుగునా అణువణువునా జల్డెడ పట్టారు. గడచిన కొద్ది రోజులుగా విజయనగరంలో గంజాయి సరఫరా అవుతోంది .. ఏఓబీ నుంచీ ట్రైన్ లలో తెచ్చుకుంటున్నారన్న సమాచారంతో ఖాకీలు జల్లెడ పట్టారు. విశేషమేంటంటే…. పాలకొండ ఎమ్మెల్యేను సైతం వదలకుండా… ఆటోలో వెళుతున్న ఎమ్మెల్యే ఫ్యామిలీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు… పోలీసులు.ఈ సెర్చ్ లో ఎస్ఐలు తారకేశ్వరరావు, నవీన్ పడాల్, హరిబాబు, రామ్ గణేష్ సిబ్బంది ఉన్నారు.
previous post