27.7 C
Hyderabad
April 26, 2024 04: 09 AM
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రరం జిల్లాలో నాకాబందీ నిర్వ‌హించండి

VijayanagaramS P

విజ‌య‌న‌గ‌రరం జిల్లాలో తొలిసారిగా పోలీసులు కార్డ‌న్ సెర్చ్..నాఖా బంధీ నిర్వ‌హించేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. వ‌చ్చేనెల 10న జ‌ర‌గ‌బోవు మున్సిప‌ల్ ఎన్నిక‌ల బందోబ‌స్తున‌కు సంబంధించి జిల్లాలో ఎస్ఐ స్థాయి నుంచీ డీఎస్పీ స్థాయి వ‌ర‌కు గ‌ల సిబ్బందితో ఎస్పీ రాజ‌కుమారీ…డీపీఓ లోని కాన్ఫ‌రెన్స్ హాలులో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. 

ఒక కార్పొరేష‌న్, మూడు పుర‌పాల‌క సంఘాల ఎన్నిక‌ల బందోబ‌స్తు దృష్ట్యా శాఖాప‌రంగా తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు,బందోబ‌స్తునకు సంంధించి జిల్లా ఎస్పీ  అంత‌ర్గ‌తంగా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ మేర‌కు ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో పోలీస్ అధికారిని ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణాధికారిగా  నియ‌మించారు.

విజ‌య‌న‌గ‌రానికి సంబందించి విజ‌య‌న‌గ‌రం డీఎస్సీ అనిల్ ను, పార్వ‌తీపురానికి అడిష‌న‌ల్ ఎస్పీ స‌త్యనారాయ‌ణ‌, సాలూరుకు ఓఎస్డీ సూర్య‌చంద్ర‌రావు, బొబ్బ‌లికి బీ.మోహ‌న్ రావు, నెల్లిమ‌ర్ల‌క‌ సీసీఎస్ డీఎస్పీ పాపారావును నియ‌మించారు.

మొన్న  జ‌రిగిన పంచాయితీ ఎన్నిక‌ల మాదిరిగానే…మున్సిప‌ల్ ఎన్నిక‌లలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా  బందోబ‌స్తు నిర్వ‌హించాల‌న్నారు. ఫ‌లితంగా పోలీస్ శాఖ‌కు  మ‌రోసారి మంచి గుర్తింపు తీసుకురావాల‌ని ఎస్పీ అన్నారు.

రెవిన్యూ శాఖ కూడా ఒక్కో మున్సిపాలిటీ ఒక్కో ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణాధికారిని నియమించింద‌ని..వారితో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ అధికారులు అంద‌రూ స‌మర్ధ‌వంతంగా ఎన్నిక‌ల బందోబ‌స్తు నిర్వ‌హించాల‌ని ఎస్పీ తెలిపారు.

ఎన్నిక‌ల కోడ్ అమ‌లయ్యేలా చ‌ర్య‌లు చేపట్టాల‌ని…సెక్ష‌న్ 30 అమ‌లులో ఉంద‌న్న విష‌యం ప్ర‌తీ పోలీస్ సిబ్బంది గుర్తు పెట్టుకోవాల‌ని ఎస్పీ అన్నారు.కాగా మైక్ ప‌ర్మిష‌న్లు,స‌మావేశాలు..సంబంధిత డీఎస్పీల అనుమ‌తి తీసుకునే నిర్వ‌హించుకోవాల‌ని….ఈ విష‌యం స్థానికంగా విధులు నిర్వ‌హిస్తున్న పోలీస్ అధికారి తెలుసుకోవాల‌న్నారు.

స్థానిక సంస్థ‌ల మాదిరిగానే ప్లాగ్ మార్చ్ లు నిర్వ‌హించాల‌ని ఎస్పీ తెలిపారు.ఈ స‌మీక్షా స‌మావేశంలో అద‌న‌పు ఎస్పీలు స‌త్య‌నారాయ‌ణ‌,సూర్య చంద్ర‌రావు,డీఎస్పీలు అనిల్,పాపారావు,మోహ‌న్ రావు,సుభాష్, సీఐ లు ముర‌ళీ, శ్రీనివాస‌రావు,కేశ‌వ‌రావు,మంగ‌వేణి,అప్ప‌ల‌నాయుడు,ఎస్ఐలు ఫ‌కృద్దీన్, నారాయ‌ణ‌రావు, ధ‌నంజ‌య్ నాయుడు, అశోక్ కుమార్, గంగ‌రాజులు పాల్గొన్నారు.

Related posts

గుర్రంపై వచ్చి నామినేషన్

Satyam NEWS

ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడులకు ప్రయత్నం

Satyam NEWS

ఏపీ డిప్యూటీ స్పీకర్.. రంజాన్ శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment