28.2 C
Hyderabad
April 20, 2024 14: 42 PM
Slider ముఖ్యంశాలు

Corona 2nd wave: అన్ని జిల్లా కేంద్రాల్లో ఐసోలేషన్ కేంద్రాలు

#EtalaRajendar

కరోనా వైరస్ రెండో దశ విజృంభణ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సత్వర చర్యలు చేపడుతున్నది. అన్ని జిల్లా కేంద్రాలలో మునుపటిలా ఐషోలేషన్ సెంటర్ల ఏర్పాటు చేశామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో ఇంట్లో ఉండే అవకాశం లేని వారందరికీ ఐషోలేషన్ సెంటర్ల లో ఉంచేదుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అతి త్వరలో వీటిని సిద్దం చేస్తామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ట్రేసింగ్- టెస్టింగ్- ట్రేసింగ్- ట్రీటింగ్ విధానంలో కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కాంటాక్ట్ పర్సన్స్ కి వెంటనే మొబైలు ద్వారా అలర్ట్ మెసేజ్ వెళ్లేలా కొత్త యాప్ ను రూపొందించినట్టు మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కొత్త యాప్ తో ట్రేసింగ్ అత్యంత తొందరగా చేయడానికి వీలవుతుంది.

కరోనా లక్షణాలు ఉన్న వారందరూ నిర్లక్ష్యం చేయకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ తగిన సలహాలు సూచనలు అందిస్తున్నారని మంత్రి ఈటెల చెప్పారు.

వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖలను సమన్వయం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో నేచర్ క్యూర్ హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్, నిజామియా టీబీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్ ను పూర్తి స్థాయిలో కరోనా చికిత్స, క్వారంటైన్ సెంటర్ లుగా మార్చేందుకు వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది.

మరో వారం రోజుల్లో వీటిని సిద్దం చేయాలని మంత్రి ఈటెల అధికారులని ఆదేశించించారు.

Related posts

రాహుల్ ను సద్దాంతో పోల్చడం పై కాంగ్రెస్ ఆగ్రహం

Bhavani

చంద్రబాబు విమర్శలు కరెక్ట్ కాదు

Bhavani

దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ లక్ష్యo

Murali Krishna

Leave a Comment