35.2 C
Hyderabad
April 24, 2024 14: 31 PM
Slider నిజామాబాద్

Corona Alert: సెంచరీకి దగ్గరలో కరోనా కేసులు

#Kamareddy Municipality

కరోనా కేసులు కరుణ చూపడం లేదు. కామారెడ్డి జిల్లాలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సెంచరికి చేరువలో కేసులు నమోదయ్యాయి. దాంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో నేటి సాయంత్రం వరకు మొత్తం 98 కేసులు నమోదయ్యాయి. ఇందులో బాన్సువాడకు చెందిన ఒకరు హైదరాబాద్ లో ఆస్పత్రిలో మృతి చెందారు. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో భయం నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు స్వచ్చంద లాక్ డౌన్ అమలు చేసుకుంటున్నారు. జిల్లాలో 23 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ కాగా మిగతా వారు చికిత్స పొందుతున్నారు.

జాగ్రత్తలు పాటించని ప్రజలు

జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు విజృంభిస్తున్న ప్రజల్లో ఇసుమంతైన భయం లేకుండా పోతుంది. గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తున్న మాకు కరోనా సోకలేదు కదా అన్నట్టు ధీమాగా ఉన్నారు. నిత్యం వేలాదిగా జిల్లా కేంద్రానికి తరలి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కనీసం భౌతిక దూరం కూడా పాటించడం లేదు. మాస్కులు ధరించడం కూడా మరుస్తున్నారు.

జరిమానాల జాడే లేదు

మాస్కు ధరించకపోతే వెయ్యి జరిమానా అన్న విషయం కేవలం కాగితాలకే పరిమితమైంది. కరోనా వైరస్ మొదలైన సమయంలో ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలన్న నిబంధనలు పాటించారు. ఇప్పుడు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ రావడంతో మాస్కు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వచ్చే కరోనా అగుతుందా అన్నట్టు ప్రజలు ప్రవర్తిస్తున్నారు. జరిమానాలు విధించాల్సిన అధికారులు మొదట్లో అనేక మందికి జరిమానాలు విధించి మమ అనిపించారు. ప్రస్తుతం ఎక్కడ కూడా జరిమానా విధించినట్టు కూడా వినిపించడం లేదు. కొద్దీ రోజులు మాస్కు ధరించనందుకు రెండు వందల జరిమానా విధించామని పంచాయతీ కార్యాలయాల్లో రసీదులు చింపి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ప్రస్తుతం ఎక్కడ కూడా జరిమానాకు సంబందించిన రసీదులు కనపడటం లేదు.

రాబోయేవి అన్ని శుభదినాలే

రాబోయే రోజుల్లో శుభదినాలే కావడంతో పెళ్లిళ్లు అధిక సంఖ్యలో జరగనున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 20 మందికి మాత్రమే అనుమతినిస్తున్నారు. ఫంక్షన్ హాళ్లకు ఎక్కడ కూడా అనుమతి ఇవ్వడంలేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ప్రజలు పెళ్లిళ్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఓ వ్యాపారి నిర్వహించిన ఫంక్షన్ ద్వారానే కరోనా కేసులు జిల్లాలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం ఫంక్షన్లు అంటేనే ప్రజలు భయపడుతున్నారు.

మార్పు రావాల్సింది ప్రజల ద్వారానే

కరోనాను నియంత్రించాలంటే మార్పు రావాల్సింది ప్రజల నుంచే అని అధికారులు చెప్తున్నారు. తాము ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ప్రజలు పెడచెవిన పెడితే మాత్రం చేసేదేముంది అంటున్నారు. కానీ విలువైన ప్రాణాలు మాత్రం ప్రజలు కాపాడుకోవడానికి సిద్ధం కావాలి. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని చెప్తున్నప్పటికి దానిని దరిచేరకుండా చేసే అవకాశం ప్రజలకు ఉంది. ఇకనైనా ప్రజలు భౌతిక దూరం పాటించి జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Related posts

మ్యాట్  ల్యాబ్ లో  అధ్యాపకులకు  శిక్షణ కార్యక్రమం

Satyam NEWS

వ్యాక్సిన్ వచ్చింది సరే…మనకు అందేది ఎలా?

Satyam NEWS

విజయనగరం తిరువీధుల్లో ఊరేగిన వెంకన్న సామి..!

Satyam NEWS

Leave a Comment