28.7 C
Hyderabad
April 25, 2024 06: 46 AM
Slider ముఖ్యంశాలు

కరోనా ఎలర్ట్: క్వారంటైన్ కేంద్రానికి తీసుకువెళ్లే సిబ్బందికి ఇబ్బంది

shamshabad rtc

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా వైరస్ నిరోధానికి పటిష్ట చర్యలు చేపడుతున్నారు కానీ ఈ పనులను చేస్తున్న వారికి సరైన రక్షణ కల్పించడంలేదనే విమర్శలు వస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశాలనుండి వచ్చిన వారిని క్వారంటాయిన్ రూమ్స్ కు  తరలించడానికి RTC బస్సులను ఏర్పాటు చేశారు.

విదేశాలనుండి వచ్చిన వారి లగేజీ ని తరలించడానికి ప్రైవేట్ లారీలు, డీసీఎం లను అందుబాటులో ఉంచారు. అంత వరకూ బాగానే ఉంది కానీ బస్సు డ్రైవర్లకు, మహిళ కండక్టర్ లకు  ఎలాంటి కరోనా రక్షణ సదుపాయాలు కల్పించలేదు. తాము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా తమకు కరోనా రక్షణ సౌకర్యాలు కల్పించడం లేదని ఆర్టీసీ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.

కేవలం తినడానికి 100 రూపాయలు ఇస్తున్నారని అవి టీ తాగడానికి కూడా సరిపోవడం లేదని RTC సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల్లో ఎలాంటి సానిటైజేషన్ ఏర్పాట్లు లేవని, కనీసం మాస్కులు, హాండ్ గ్లోవ్స్న కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము డ్యూటీ మొదలు పెట్టి 24 గంటలు దాటినా ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నామని తెలిపారు.

రాత్రి వేళల్లో దోమలకు ఇబ్బందులు పడ్డామని, కొద్దీ మంది RTC సిబ్బంది షుగర్, బీపీ ల లాంటి వాటితో మందులు లేక ఇబ్బందులు పడుతున్నారని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విధుల కోసం వెళ్లిన RTC సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

సిజెఐ ని కలిసిన గోరేటి

Sub Editor 2

52 కోట్లతో మూసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

Satyam NEWS

శ్రీకాకుళం రూరల్ మండలంలో గాంధీ జయంతి

Satyam NEWS

Leave a Comment