39.2 C
Hyderabad
March 29, 2024 16: 02 PM
Slider నిజామాబాద్

ఎవేర్ నెస్: గ్రామీణులకు కరోనా మాస్కుల పంపిణీ

bichkunda mask 111

బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో తహసీల్దార్ ఎంపీడీఓ  ఎంపిఒ లు గ్రామంలో పర్యటించారు. పారిశుద్ధ కార్మికులకు మాస్కులను అందజేసి సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్న తీరును పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఈ ద్రావణాన్ని జాగ్రత్తగా స్ప్రే చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట్రావ్ ఎంపీడీఓ ఆనంద్ మండల పరిషత్ అధికారి మహబూబ్ తో పాటు మండల ఉపాధ్యక్షులు రాజు పటేల్ సర్పంచ్ విజయలక్ష్మి భూమి శెట్టి సొసైటి చైర్మన్ ఇందిరా దేశాయి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.

అదే విధంగా బిచ్కుంద మండలంలోని చిన్న దడిగి గ్రామంలో సర్పంచ్ అనిత విట్టల్ రెడ్డి ఇంటింటా తిరుగుతూ మాస్కులను ప్రజలకు అందజేశారు. ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని ఆమె కోరారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి అందరం కృషి చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శికి రాజరత్నం గ్రామ రెవెన్యూ అధికారి రాజు .మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఊర్మిళా ఐకేపీ సీఏ లావణ్య ఆశా కార్యకర్త సంతోష గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు విట్టల్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Related posts

ట్విట్లర్ లో మారు మోగుతున్న అమిత్ షా రాజీనామా డిమాండ్

Satyam NEWS

కరోనాతో ఒక్కరోజే 9 మంది మృతి

Bhavani

కరోనా కష్టాలతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment