40.2 C
Hyderabad
April 24, 2024 17: 21 PM
Slider విజయనగరం

కరోనా అదుపు కోసం ఫోరం ఫర్ బెటర్ విజయనగరం అవగాహన ర్యాలీ

#Vijayanagaram

విద్యలనగరమైన విజయనగరంలో అన్ని సంస్థలు సంయుక్తంగా ఫోరం ఫర్ బెటర్ విజయనగరం గా ఆవిర్భవించాయి. ఈ నేపథ్యంలో అన్ని సంస్థలు కలిసి…నగరంలో కరోనా నివారణ… మాస్క్ అవసరం అన్న దానిపై ర్యాలీ నిర్వహించారు.

నగరంలో ని పైడితల్లి అమ్మవారి టెంపుల్ వద్ద ఈ ర్యాలీని స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే మేయర్ వీ.విజయలక్ష్మి.. డిప్యూటీ మేయర్ ,స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ.. కరోనా సెకండ్ వేవ్ పట్ల ప్రతీ ఒక్కరూ జాగరూకతతో ఉండాలని 45 ఏళ్ల పైబడిన ప్రతీ ఒక్కరూ వాక్సినేషన్ వేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ వర్మ మాట్లాడుతూ.. ఈ సెకండ్ వేవ్ లో అందుబాటులో వచ్చిన వాక్సినేషన్ నూ ప్రతీ ఒక్కరూ వేసుకోవాలన్నారు.

ఈ పరిస్థితులలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందించదగ్గ అంశమన్నారు. అనంతరం అమ్మవారి కోవెల నుంచీ ప్రారంభమైన ర్యాలీ కన్యకాపరమేశ్వరి టెంపుల్ వరకూ కొనసాగింది.

Related posts

రామకృష్ణాపురంలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam NEWS

వైసీపీ నుంచి జనసేనకు కాపు నేతల వలసలు

Bhavani

సిట్ విచారణకు కొనసాగించాలి

Murali Krishna

Leave a Comment