33.2 C
Hyderabad
April 25, 2024 23: 28 PM
Slider విజయనగరం

ఒక్క రోజే 100 కేసులు…బెంబేలెత్తిపోతున్న ప్ర‌జ‌లు..

#VijayanagaramPolice

విజయనగరం జిల్లాలో  కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ఒక్క రోజులోనే వంద పాజ‌టివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ప్ర‌జ‌లంతా ఆందోళ‌న చెందుతున్నారు. మ‌రోవైపు శ‌ర వేగంగా ప్ర‌బలుతున్న క‌రోనా సెకండ్ వేవ్ ప‌ట్ల‌..రెవిన్యూ,పోలీస్ శాఖ విస్త్ర‌త ప్ర‌చారం క‌ల్పిస్తున్నాయి.

ఎస్ఎంఎస్ అవ‌స‌ర‌మ‌ని నొక్కి చెబుతున్నాయి. తాజాగా ఎస్పీ రాజ‌కుమారీ ఆదేశాల మేర‌కు ట్రాఫిక్ డీఎస్పీ  మోహ‌న్ రావు సూచ‌న‌ల మేర‌కు న‌గ‌ర‌ సీఐ ఎర్రం నాయుడు స‌హ‌కారంతో ఎస్ భాస్క‌ర్ రావు త‌న  బృందంతో న‌గ‌రంలోని ఎత్తు బ్రిడ్జి వ‌ద్ద కోర‌నా నివార‌ణ‌కు మాస్క్ ధ‌రించ‌డం పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఉదయం తొమ్మిదిగంట‌ల స‌మ‌యంలో..ట్రాఫిక్ సిబ్బంది అంతా కాస్సేపు ట్రాఫిక్ ను స్తంభించి.. శ‌ర వేగంగా క‌రోనా కేసులు పెర‌డం అందుకు నివార‌ణాపోయాల‌న తెలియ చేసారు.

మాస్క్ ధ‌రించ‌డండి..ప్రాణాల‌ను కాపాడుకోండి. నో మాస్క్..నో అవుట్ సైడ్..అన్న నినాదాల‌తో ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. గ‌త  కొద్ద రోజుల నుంచీ పెరుగుతున్న క‌రోనా కేసుల గురించి ప్ర‌జ‌ల‌లో అవ‌గాహన క‌ల్పించేందుకు స్వ‌యంగా ఎస్పీ రాజ‌కుమారీ రోడ్ల పైకి  వ‌వ్చి మ‌రీ మాస్క్ లేని వాళ్ల‌కు మాస్క్ లు ఇస్తున్నారు.

ఇంత చేస్తున్నా…ఈ ఒక్క రోజే  100 కేసులు రావ‌డంతో  జిల్లా యంత్రాంగం హ‌డ‌లెత్తి పోతోంది. దీంతో క‌లిసి నిర్వ‌హించే కార్య‌క్ర‌మాలు..గుమిగూడి ఉండే ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు స్వ‌స్థి ప‌ల‌కాల‌ని  జిల్లా యంత్రాంగం ఘోషిస్తోంది. ఏదైనా తాజాగా క‌రోనా సెకండ్ వేవ్  పుణ్యమా…ఒక్క రోజే 100 కేసులు రావ‌డం  కాస్త ఆందోళ‌న క‌ర‌మైన అంశ‌మ‌నే చెప్పాలి.

Related posts

రిబ్బన్ కట్:పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన కలెక్టర్ ఎస్పీ

Satyam NEWS

రిజిస్ట్రేషన్లపై ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధన ఎత్తివేత హ‌ర్ష‌ణీయం

Sub Editor

తొలి స‌ర్వ‌స‌భ్య స‌మావేశం లోనే సస్పెండ్ అయిన సూపర్ వైజర్

Satyam NEWS

Leave a Comment