34.2 C
Hyderabad
April 19, 2024 21: 04 PM
Slider విజయనగరం

తాజాగా 197 కరోనా కేసులు… ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ తప్పనిసరి

#RajakumariIPS

రోజు రోజుకు జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ తో కేసులు పెరుగుతున్నాయని..తాజాగా 200 లకు చేరుకున్నాయని ఎస్పీ రాజకుమారీ అన్నారు. జిల్లా యంత్రాంగం లy పలువురు అధికారులకు కూడా కరోనా వచ్చిందని ప్రతీ ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

కరోనా రెండవ వేవ్ చాలా వేగంగా విస్తరిస్తున్నందున, ప్రజలందరూ ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, జాగ్రత్తలు పాటించాలన్నారు. జ విజయనగరంలోని దాసన్నపేట రైతు బజార్, కోట జంక్షను వద్ద వాహన దారులు, వ్యాపారస్థులు, కొనుగోలుదారులు, ప్రజలు, కళాశాల విద్యార్ధులకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి  ఎస్పీ అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వాళలకు శానిటైజేషన్ కూడా ఎస్పీ స్వయంగా వేసారు. మాస్క్  ధరించకుండా ఉన్న వారిన అందజేస మాస్క్ లు లేకుండా ఉన్న పిల్లకు జిల్లా ఎస్పీ స్వయంగా మాస్క్ లు ధరించి మాస్క్ యొక్క ప్రాధాన్యతను వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – ప్రస్తుతం రాష్ట్రంలోను, జిల్లాలోనూ రోజు, రోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించిడం చేతులను తరుచూ శినిటైజర్ తోగాని, సబ్బుతో గాని శుభ్రపరుచుకోవడం, మనిషికి, మనిషికి కనీసం మూడు అడుగుల దూరం పాటించాలన్నారు.

కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ఆటొ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు మాస్క్ లు అందజేసి కరోనా జాగ్రతలు పాటిచవలసిందిగా సూచించారు. ముఖ్యంగా యువకులు మాస్క్ లు ధరించడం లేదని, 20 ఏళ్ళు లోపు ఉన్నవారికి కరోనా వైరస్ సోకినప్పటికీ వారికి ఉన్న ఇమ్యూనిటీ వలన లక్షణాలు బయటపడవని, కాని వారు కరోనా కేరియర్లుగా మారి వారి ఇంటిలో ఉన్న తల్లి, దండ్రులకు ఇతర కుటుంబ సభ్యులను వైరస్ వ్యాపించే వాహకులుగా మారుతారన్నారు.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఇంటినుండి బయటకు వచ్చినప్పటినుండి, పనులు ముగించుకొని మరల ఇంటికి చేరుకొనేవారుకు ప్రతిఒక్కరు ఖచ్చితంగా మాస్కు ధరించాలని, జిల్లా ఎస్పీ కోరారు. వాహన దారులకు, మాస్క్ ధరించని యువకులకు జిల్లా ఎస్పీ కౌన్సిలింగు నిర్వహించి, వారికి మాస్క్ లను అందజేసారు.

కరోనా నియంత్రణకు ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలను స్వచ్ఛందంగా పాటించాలన్నారు.  శానిటైజరుతో తరుచూ శుభ్రం చేసుక సాధ్యమైనంతవరుకు అందుబాటులో ఉన్న వ్యక్తులు వ్యాక్సిన్ తీసుకొనేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. కరోనా నియంత్రణలో వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందన్నారు.

వ్యాక్సిన్ తీసుకోవడం వలన మన ప్రాణాపాయం లేకుండా ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ వెంట విజయనగరం ట్రాఫిక్  ఎస్.ఐ ఎస్. భాస్కరరావు, టూటౌన్ సీ.ఐ సి.హెచ్.శ్రీనివాసరావు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ ఆస్తులు అదానీ, అంబానీలకు ఇస్తున్న ప్రధాని మోడీ

Satyam NEWS

పాకిస్థాన్ లో మైనారిటీలపై ఆగని దాడులు: ఇద్దరు సిక్కుల హత్య

Satyam NEWS

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment