30.7 C
Hyderabad
April 19, 2024 08: 32 AM
Slider విజయనగరం

వాక్సినేషన్ వేసుకున్నా..మాస్క్ తప్పనిసరి…!

VijayanagaramSP

విజయనగరం జిల్లాలో మరో సారి కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా ప్రబలుతోంది. తాజాగా జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి. కరోనా వాక్సినేషన్ వేసుకున్నా…మాస్క్ తప్పనిసరి అంటూ సాక్షాత్ జిల్లా పోలీస్ సూపరెంటెండెంట్ రాజకుమారీ.. జిల్లా ప్రజలను హెచ్చరించారు.

ఈ పరిస్థితులలో జిల్లా కేంద్రంలో ని కోట జంక్షన్ వద్ద ఎస్పీ స్వయంగా… మాస్క్ పెట్టుకోని నగర ప్రజలను పట్టుకున్నారు. నేరుగా జంక్షన్ వద్ద సాయంత్రం వేళలో మాస్క్ లేని ఓ తల్లీ బిడ్డకు స్వయంగా ఎస్పీ మాస్క్ తొడిగారు.మాస్క్ లేని ప్రజలను… దొంగలను పట్టుకున్నట్టుగా…ట్రేస్ చేసి మరీ పట్టుకున్నారు.

ఎస్పీ కోట జంక్షన్ వద్దకు వచ్చిన పావుగంట తర్వాత డీఎస్పీ మోహనరావు, సీఐ ఎర్రంనాయుడులు వచ్చారు. అప్పటికే అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు.. మేన్ ప్యాక్ ద్వారా నగరంలో కి ఎస్పీ వస్తున్నారని తెలుసుకున్న వెంటనే అప్రమత్తం అయ్యారు.

మాస్క్ లేకుండా రోడ్ మీదకు వచ్చిన ఇద్దరు చిన్నారులకు ఎస్పీ మాస్క్ తొడిగారు. అలాగే ఆటోలో ఏడాది వయస్సు ఉన్న  పాపతో ట్రావెల్ చేస్తున్న తల్లికి మాస్క్ లేకపోవడాన్ని గుర్తించిన ఎస్పీ..స్వయంగా ఆటోను ఆపి..ఆ తల్లీ బిడ్డను దించి కౌన్సలింగ్ ఇచ్చి వాళ్లకు మాస్క్ తొడిగారు.

కొద్దిసేపటికి అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, నగర వన్ టౌన్ సీఐ మురళీ ,ఎస్ఐ దేవీ ,టూటౌన్ ఎస్ఐ లు జనార్దన్ ,ఏఎస్ఐ రాజు తదితరులు ఉన్నారు.

Related posts

టీడీపీ ఎన్నికల బహిష్కరణ సరైందని కోర్టు తీర్పుతో రుజువైంది

Satyam NEWS

నాటి మంత్రుల శిలాఫలకాలు..నేటి మంత్రుల ప్రారంభోత్సవాలు…

Satyam NEWS

విద్యుత్ బిల్లు కట్టలేను.. ఆర్థిక సహాయం చేయండి సారు

Satyam NEWS

Leave a Comment