39.2 C
Hyderabad
April 25, 2024 17: 58 PM
Slider జాతీయం

కలవరం కలిగిస్తున్న కరోనా భారతం

corona case

భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. నేటికి దేశవ్యాప్తంగా 2586 మందికి కరోనా సోకగా 73 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 192 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 423 పాజిటివ్ కేసులు నమోదు కాగా 21 మంది మృతి చెందారు.

తమిళనాడు లో నేడు ఒక్క సారిగా పాజిటీవ్ కేసులు పెరిగి 309కి చేరుకున్నాయి. ఒకరు మరణించారు. ఢిల్లీలో 293 కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. కేరళలో 286 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో పాజిటీవ్ కేసుల సంఖ్య 161 కి చేరుకున్నది.

తెలంగాణ 154 కేసులు నమోదు కాగా ఇప్పటికి 9 మంది మృతి చెందారు. రాజస్థాన్ లో పాజిటీవ్ కేసులు 154కు చేరాయి. ఉత్తరప్రదేశ్ లో 128 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. కర్ణాటకలో 124 పాజిటివ్ కేసులు ఉండగా ముగ్గురు మరణించారు.

మధ్యప్రదేశ్ 107 కేసులు ఉండగా 8 మంది మృతి చెందారు. గుజరాత్ 95 కేసులు ఉండగా 8 మంది మరణించారు. అలాగే జమ్మూకాశ్మీర్ లో 70 కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ 53 కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు.

హర్యానాలో 49 కేసులు, పంజాబ్ లో 47  కేసులు, ఐదుగురు మృతి, బీహార్ 29 కేసులు, ఒకరు మృతి చెందారు. చండిఘడ్ 18, అస్సాం16, లడక్ 13, అండమాన్ 10, చత్తీస్గఢ్ 9, ఉత్తరాఖండ్ 10, గోవా 6, హిమచల్ 6 కేసులు నమోదు కాగా ఒకరు మరణించారు. ఒడిశా 5, ఝార్ఖండ్ 2, మిజోరాం 1, మణిపూర్ 2, పుదుచ్చేరి 5, అరుణాచల్ ప్రదేశ్ 1 కేసు నమోదు అయ్యాయి.

Related posts

2020లో భువి నుంచి దివికేగిన ప్ర‌ముఖులు

Sub Editor

పాపం పండింది: ఏసీబీ ఉచ్చుకు చిక్కిన ఎస్ ఆర్ ఓ మూర్తి

Bhavani

గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె 4 వ రోజు కొనసాగింపు

Satyam NEWS

Leave a Comment