27.7 C
Hyderabad
April 26, 2024 04: 23 AM
Slider జాతీయం

వ్యాక్సిన్ వేయించుకున్న వారికి వాట్స్ యాప్ ద్వారా సర్టిఫికెట్

#whatsapp

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఇక నుంచి వాట్స్ యాప్ ద్వారా సర్టిఫికెట్ పొందవచ్చు.

క్షణాల్లోనే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను పొందే అవకాశం కల్పించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ కార్యాలయం వెల్లడించింది.

ప్రస్తుతం వారు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే వారు కో విన్ పోర్టల్ లో లాగిన్ అయి తీసుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు MyGov Corona Helpdesk లో మూడు సులభమైన వివరాలు ఇచ్చి సర్టిఫికెట్ పొందవచ్చు.

సెల్ నెంబర్ 9013151515 ను ముందుగా సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత covid certificate అని టైప్ చేసి వాట్స్ యాప్ లో పంపాలి.

ఓటిపిని ఎంటర్ చేయడం ద్వారా కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను పొందవచ్చునని ఆరోగ్య మంత్రి కార్యాలయం ట్విట్టర్ లో తెలిపింది.

ఆదివారం సాయంత్రం నాటికి దేశ వ్యాప్తంగా 50,68,10,492 మందికి కరోనా వ్యాక్సిన్ అందచేశారు.

జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ప్రారంభించిన విషయం తెలిసిందే.

Related posts

మాస్కులు కుట్టినందుకు కోటి రూపాయల చెక్కు

Satyam NEWS

చార్జ్ తీసుకుని ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో.. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సంచలన నిర్ణయం..!

Satyam NEWS

322 మంది జ‌ర్న‌లిస్టుల‌ అక్రిడిటేష‌న్ల జారీకి క‌మిటీ ఆమోదం…!

Satyam NEWS

Leave a Comment