30.7 C
Hyderabad
April 19, 2024 07: 25 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కరోనా క్యాంప్

#KollapurHospital

ప్రస్తుతం కరోనా వైరస్ పట్నం నుండి పల్లెటూర్లకు కూడా వ్యాపించింది. ఇప్పుడు పట్టణాల కంటే పల్లెటూర్లలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొల్లాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ భరత్ రావు తెలియజేశారు.

తమ సెంటర్ లో జూలై 22  తేదీ నుండి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. జూలై 22  తేదీ నుంచి సెప్టెంబర్ 9 తేదీ వరకు మొత్తం 2178 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1406 ర్యాపిడ్ టెస్టులు 782 ఆర్ టి పి సి ఆర్ టెస్టులు. ర్యాపిడ్ పరీక్షలో 179 మందికి పాజిటివ్ వచ్చింది.

ఇప్పుడు కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని కొల్లాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ భరత్ రావు తెలియజేశారు.

లేదంటే కరోనా వైరస్ బారిన పడక తప్పదు అన్నారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు హాస్పిటల్ కి వచ్చి కరోనా పరీక్షను చేయించుకోవాలని ఆయన అన్నారు. కరోనా  పరీక్షల్లో  పాజిటివ్  వచ్చిన వారు 17 రోజులు వైద్యుల పర్యవేక్షణలో హోమ్ క్వారన్ టైన్ లో ఉండాలని తెలిపారు.

14 రోజుల తర్వాత కరోనా లక్షణాలు ఉంటే వారు కూడా కరోనా పరీక్ష చేయించుకోవాలి. హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారిని వైద్య సిబ్బంది డాక్టర్లు సిస్టర్స్ ఆశా కార్యకర్తలు ఇంటికి వచ్చి తగిన ఆరోగ్య సలహాలు సూచనలు మందులు ఇస్తారు.

కరోనా పాజిటివ్ వ్యక్తులు ధైర్యంగా హోమ్ క్వారంటైన్ లో ఉండి ఆరోగ్య కార్యకర్తల సలహాలు పాటిస్తే తప్పకుండా 17 రోజులలో కరోనా వ్యాధి నయమవుతుందని డాక్టర్ భరత్ రావు అన్నారు. కరోనా వ్యాధి వచ్చిందని కొందరు భయబ్రాంతులకు గురి అయి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి లక్షలు లక్షలు డబ్బులు చెల్లించి నష్టపోతున్నారని ఆయన అన్నారు.

ఆత్మస్థైర్యంతో ఇంట్లోనే  17 రోజులు ఆరోగ్య సలహాలు పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటే కరోనా వ్యాధి నయమవుతుందని ఆయన తెలిపారు. కరోనా వైరస్ నియమ నిబంధనలను పాటిస్తూ  ప్రతి ఒక్కరూ తమ తమ పనులను చేసుకోవచ్చు రాబోయే రెండు నెలల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ప్రజలందరూ అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ భరత్ రావు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో హస్పిటల్ ఛైర్మెన్ కాటం జంబులయ్య, పెంట్ల వెల్లి మెడికల్ ఆఫీసర్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ జయ చంద్ర ప్రసాద్ యాదవ్, సబ్ యూనిట్ ఆఫీసరులు రామ్మోహన్, కిషోర్ లు పాల్గొన్నారు.

Related posts

పెద్దదడిగి లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Satyam NEWS

మాజీ మంత్రి నాయినిని పరామర్శించిన మంత్రి ఈటెల

Satyam NEWS

కొల్లాపూర్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పట్టించుకునే నాథుడే లేడా…?

Satyam NEWS

Leave a Comment