31.7 C
Hyderabad
April 19, 2024 01: 48 AM
Slider విజయనగరం

మాస్క్ లు లేక‌పోతే…ఇక అంతే…పోలీసుల మాట కాస్త ఆల‌కించండి!

#VijayanagaramPolice

క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌బ‌లుతున్నా..హాస్ప‌ట‌ల్స్ లో కరోనా పేషెంట్లు చికిత్స‌కై జాయిన్ అవుతున్నా…కించిత్..జాగ్ర‌త్త ఏ ఒక్క‌రికీ  లేకపోవ‌డం..మీరు చూస్తున్న దానికి ఓ నిద‌ర్శ‌నం.

ఇక ఇన్ని రోజులు..అవేర్న‌స్..కూడ‌ళ్ల‌లో చైత‌న్యం…మైక్ లు పెట్టి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం వంటివి చేసిన పోలీసులు…ఇక చేత‌ల్లో చూపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. రెండు రోజుల నుంచీ  విజ‌య‌న‌గ‌రం జిల్ల ఎస్పీ…రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేర‌కు క‌రోనా వైర‌స్ పై   ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించే య‌త్నంలో భాగంగా…జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలలో సంబంధిత స్టేష‌న్ అధికారుల‌చే    క‌రోనా నివారణ‌కు అవేర్న‌స్ నిర్వ‌హించారు.

అలాగే విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలోని కూడా ప‌లు జంక్ష‌న్ ల‌లో సాయం కాలం పూట‌…రోడ్ల‌పై వాహ‌న‌దారుల‌ను ఎస్పీ రాజ‌కుమారీ కాస్సేపు ఆపి మ‌రీ…ప్ర‌జ‌ల‌ను క‌రోనా ప‌ట్ల అవగాహ‌న..ముందు జాగ్ర‌త్త‌లు చెప్పారు కూడా.

అయితే తాజాగా…ఉద‌యం పూట ఏకంగా ట్రాఫిక్ పోలీసులే…రంగంలోకి దిగారు. కరోనా నివార‌ణ‌,నియంత్ర‌ణ కు…మూడే మార్గాలంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ  గొంతెత్తి  ఆరుస్తున్నా ఏ ఒక్క‌రూ పాటించ‌క‌పోగా…తిరిగి…క‌రోనా వైర‌స్ ను మోసుకుని వాళ్లు ప‌ని చేసే ప్ర‌దేశాల‌కు వెళ్లి అంటిస్తుండ‌టాన్ని గుర్తించిన జిల్లా ఎస్పీ…ట్రాపిక్ పోలీసుల‌ను కూడా రంగంలోకి దిగమ‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే డీఎస్పీ మోహన్ రావు…తన సిబ్బందితో స్వ‌యంగా రంగంలోకి దిగారు. న‌గ‌రంలోని మ‌యూరీ జంక్ష‌న్ వ‌ద్ద‌….ఉదయం సుమారు 7 గంట‌ల నుంచీ గంట‌న్న‌ర సేపు మాస్క్ లు పెట్టుకోని వాళ్ల‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. మాస్క్ లు పెట్టుకోని వారికి 500 నుంచీ వెయ్యి రూపాయ‌లు జ‌రీమాన విధించే ప‌నిలో ప‌డ్డారు.ఈ అవేర్స‌స్ లో ఎస్ఐ జీయాద్దీన్,ఏఎస్ఐ రామ‌కృష్ణ‌, కానిస్టేబుళ్లు ఉన్నారు.

ఏదైనా…క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌కు..ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లుగా ఎస్ఎంఎస్…సోష‌ల్ డిస్ట‌న్స్ ,మాస్క్, శానిటైజ‌ర్  ఈ మూడు అత్య‌వ‌స‌ర‌మ‌ని పోలీసులు చెప్ప‌క‌నే చెబుతున్నారు.చూద్దాం..ఎంత మేర‌కు ప్ర‌జ‌ల‌లో మార్పు వ‌స్తుందో…

Related posts

సూర్యాపేట జిల్లాలో మరో భారీ థర్మల్ విద్యుత్ కేంద్రం

Satyam NEWS

మొబైల్ నుంచి ఆర్ధిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం

Satyam NEWS

ఇక నుంచి డైలీ హంట్ లో సత్యం న్యూస్

Satyam NEWS

Leave a Comment