27.7 C
Hyderabad
April 18, 2024 08: 32 AM
Slider హైదరాబాద్

కరోనా మందుల బ్లాక్ మార్కెటీర్ల రాకెట్ అరెస్టు

#Hyderabad Police

కరోనా చికిత్సలో కీలకమైన మందులను బ్లాక్ మార్కెట్ చేస్తున్న ఎనిమిది మందిని హైదరాబాద్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. కరోనా చికిత్సలో రెమిడ్ స్వియర్ ఇంజెక్షన్ అతి కీలకమైనది. దీనితో బాటు ఆక్టిమ్రా, ఫెబీ ఫ్లూ ట్యాబ్లెట్లు కూడా యాంటీ వైరల్ మందులు. వీటిని వీరంతా కలిసి బ్లాక్ మార్కెట్ లో అమ్మతున్నారు.

సికింద్రాబాద్ లో సర్జికల్ బిజినెస్ చేసే కె.వెంకట సుబ్రహ్మణ్యం ఎలియాస్ ఫణి మల్కాజ్ గిరిలోని ఆనంద్ బాగ్ లో ఉన్న తన కంపెనీ అయిన మెడిక్యూర్ ప్రొడక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా ఈ మందులను సంగారెడ్డిలోని హెటిరో డ్రగ్స్ కంపెనీ నుంచి నేరుగా తెప్పించేవాడు. దాన్ని సంతోష్ కుమార్ కు అమ్మేవాడు.

సంతోష్ కుమార్ ఈ మందులను కె.కిషోర్, మహ్మద్ షకీర్ అనే ఇద్దరికి అమ్మేవాడు. వారిద్దరూ రాహుల్ అనే వాడికి మందులను సరఫరా చేసేవారు. రాహుల్ మరో ఇద్దరు వ్యక్తులు ఫిర్దోజ్, సైఫ్ అనే వారి ద్వారా అమ్మకాలు సాగించేవాడు. ఇన్ని చేతులు మారే సరికి రూ.5,400 ఉండే కోవిఫైర్ అనే రెమెడి స్వియర్ ఇంజెక్షన్ ఖరీదు 30 నుంచి 40 వేల రూపాయలకు చేరేది.

అదే విధంగా ఫాబి ఫ్లూ, ఆక్టమ్రా టాబ్లెట్లను కూడా బ్లాక్ లో అమ్మేవారు. ఈ ముందులు అన్నీ కూడా కేవలం ఆసుపత్రులకు మాత్రమే సరఫరా చేయాల్సి ఉంది. ఆసుపత్రులు తమ అవసరాలను బట్టి తెప్పించుకోవాలి. రెమిడి స్వియర్ మందు రోగికి ఇచ్చే సమయంలో సంబంధిత డాక్టర్ రోగి బంధువుల నుంచి నో అబ్జెక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

ఇన్ని జాగ్రత్తలు తీసుకుని వాడాల్సిన ఈ మందులను ఈ కరోనా సమయంలో వీరంతా కలిసి బ్లాక్ మార్కెట్ చేశారు. రోగి ప్రాణాలు కాపాడాల్సిన మందులు బ్లాక్ మార్కెటీర్ల చేతుల్లో పడి వారికి లాభాలు ఆర్జించి పెట్టాయి. హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్సు పోలీసుల అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ చక్రవర్తి గుమ్మి పర్యవేక్షణలో దక్షిణ మండలం ఇన్ స్పెక్టర్ ఎస్. రాఘవేంద్ర, ఎస్ ఐ లు వి నరేందర్, ఎన్ శైలం, మహ్మద్ తాజుద్దీన్ చాదర్ ఘాట్ పోలీసులు ఈ డ్రగ్ రాకెట్ ను ఛేదించారని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు.

Related posts

కొట్లాడితే కరిగిపోవడానికి గత పాలకుల మాదిరి కాదు

Satyam NEWS

హుజూర్ నగర్ ఇండస్ట్రియల్ పార్కు భూమి పరిశీలన

Satyam NEWS

హత్యను జగన్ దృష్టి తీసుకెళ్తాం

Sub Editor

Leave a Comment