28.7 C
Hyderabad
April 25, 2024 06: 01 AM
Slider

నీ శత్రువును కూడా ప్రేమించు – ఇదే క్రీస్తు సందేశం

#Celebrations In Corona Time

ఆత్మలో చీకటి ఫలితమే లోకంలో పేదరికం. చీకటి ఆనందాల ప్రతిఫలమే నేటి సమాజంలో ప్రబలుతున్న ఎయిడ్స్, తదితర రుగ్మతల బాధితులు. హృదయం చీకటి కారణం గానే నేటి సమాజంలో హత్యలు, పరువు హత్యలు, మత హింస వంటివి జరుగుతున్నాయి.

మానవుడు దేవుడ్ని ధిక్కరించి ఆత్మ లోనికి చీకటిని తెచ్చుకొన్నాడు. దేవుడు తినవద్దు అని చెప్పిన పండును మానవుడు తిన్న వెంటనే ఆత్మ లోనికి చీకటి ప్రవేశించింది. ఆత్మలో చీకటి ప్రభావమే  దైవ భయము. ఈ చీకటి ప్రక్రియలకు శక్తి జనకుడు దైవ విరోధి సాతానుడు.

ఈ శక్తికి ఉన్న జన్యు లక్షణము సంతృప్తిని ఎరుగకుండా ఉండటం. వీటి సహజ వాంఛ మానవ మరణము. మానవుడిని దురాశలతో నింపి తొందరపెట్టి వాటిని త్వరగా మృత్యు కౌగిలి లోకి చేర్చుట వీటికి సరదా. ధూమపానము, మద్యపానము, మత్తు సేవనము, పరులతో పొందు, ఇవి మరణ విత్తనాలు.

మానవ అలవాట్లలో, సాంప్రదాయాలలో ఈ మరణ విత్తనాలు నాటడం వీటి యుక్తి. చీకటి క్రియలు ఫలితము పాపము. దీనికి ఉన్న శక్తి మరణం. పాపము ఆత్మకు మరణాన్ని రుచి చూపిస్తుంది. ఈ చీకటి ఆశల నుండి ఈ శక్తి నుండి మానవుడ్ని విడిపించ కలిగిన వారు ఎవరు?

ఆధునిక విజ్ఞానం, మానవ మేధస్సు, మతము, ఆత్మలోని చీకటిని తొలగించలేవు. ప్రతి క్షణము మరణాన్ని రుచి చూస్తున్న శరీర సాధనలు. చీకటి తో నిండిన ఆత్మ ధ్యానములు. మానవునికి దైవంతో సంబంధము ఏర్పరచలేవు. నిజదేవునితో సంబంధం ఏర్పడితేనే మానవ ఆత్మకు శాంతి లభిస్తుంది.

పరిష్కారము: మానవ హృదయంలో నిజమైన క్రిస్మస్ జరిగితేనే వాని ఆత్మలోని చీకటి తొలగింపబడుతుంది. మానవుడు ఇష్టపూర్వకంగా శ్యక్తిగా ఉన్న (పరిశుద్ధ ఆత్మ గా) ఉన్న క్రీస్తు ప్రభువును హృదయం లోనికి ఆహ్వానించి ఆయనను హృదయంలో ఉండనిస్తే నిజమైన క్రిస్మస్ జరుగుతుంది.

ఆత్మ లో చీకటి తొలగిపోయి వెలుగుతో, దైవ శాంతితో నింపబడుతుంది. ఒక్క జన్మ తోనే ముక్తి (నిత్యజీవము) పొంద గలుగుట నిజమైన క్రిస్టమస్. దీనిని సాథ్యం చేయటం కొరకు దేవుడు మానవునిగా (యేసు క్రీస్తు) గా వచ్చారు.

క్రిష్టమస్ ప్రతి ఇంట వెలుగులు నింపాలి

ఏసు క్రీస్తు భోధనలు ఆచరుస్తూ.. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు…క్రిస్తూ జన్మలో ఇమిడి ఉన్న పరిశుద్ధత.. పవిత్రత.. ప్రేమ.. తగ్గింపు స్వభావం కర్తవ్య లక్షణాలు ప్రతిఒక్కరు అలవరుచుకోవాలి.

ఏసుక్రీస్తు భోధనలు ఆచరణీయం

సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమా గుణం.

ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయి.

శాంతి, ప్రేమ, త్యాగం, క్రిష్ట మస్ పండుగ పరమార్థం

కరుణ, దయ, ప్రేమ, శాంతి, నిరీక్షణ సందేశంతో క్రీస్తు లోకానికి కొత్త మార్గాన్ని చూపారు. సాటి మనుషులు పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువులు పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతి యుత సహా జీవనం, ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశం.

క్రీస్తు భోధనలు ఎప్పటికి మనుషులు అందరిని సన్మార్గంలో నడిపిస్తాయి. నీ శత్రువును ప్రేమించు, నిన్ను హించించే వారి బాగు కోసం ప్రార్ధించు. దయాగుణం, సత్యం, పరస్పరం కలిగి ఉంటాయి. ఇవన్నీ ప్రపంచానికి చాటి చేప్పిన లోకరక్షకుడు ఏసు క్రీస్తు.

ఏసు జననం ప్రపంచానికి పర్వదినం.. క్రైస్తవ సోదరులు అందరూ క్రిష్ట మస్ పండుగను ఆనందోత్సాహంతో జరుపుకోవాలని కోరుకుందాము. కరోనా ముప్పు ఎప్పటికీ పొంచి ఉంది..

భౌతిక దూరం పాటించడం… మాస్క్ ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకొని క్రిష్ట మస్ పండుగను భక్తి శ్రద్దలతో కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులతో అనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.

సత్యం న్యూస్ క్రిస్మస్ శుభాకాంక్షలు

Related posts

ప్రశ్నించేవారిని పోలీసులతో వేధిస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

రికార్డు స్థాయి ద్రవ్యోల్బణంలో చిక్కుకున్న అమెరికా

Satyam NEWS

చైన్నైలో ఎన్.టి.ఆర్. శతజయంతి సమాలోచన

Bhavani

Leave a Comment