33.2 C
Hyderabad
April 26, 2024 02: 22 AM
Slider చిత్తూరు

కరోనా రోగి కొన ఊపిరిని తీసేసిన ఆసుపత్రులు

#RUIA Hospital

కరోనా రోగి ప్రాణం తీసేశారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈ దయనీయమైన సంఘటన జరిగింది. కరోనా సోకి, వైద్యం కోసం వెళ్లిన ఓ వ్యక్తిని అక్కడికి పోండి, ఇక్కడికి పొండి అంటూ తిప్పారు. దాంతో ప్రయాణంలోనే అతని ప్రాణం గాలిలోకి కలిసి పోయింది.

తిరుపతి నగరంలోని ఎస్ టి వి నగర్ కు చెందిన నరేంద్ర అనారోగ్యంతో ఈ నెల 3న కరోనా పరీక్షలు చేయించుకోగా 5న పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైద్యుల ఆదేశాల మేరకు హోమ్ క్వారం టైన్ లో చికిత్స తీసుకున్నాడు. అయితే అస్వస్థతకు గురై ,ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడంతో 108 ద్వారా రుయా ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

అయితే అక్కడ వెంటిలేటర్లు లేకపోవడంతో పద్మావతి, డి బి ఆర్, రమాదేవి, సంకల్ప, లోటస్, ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. లక్షల్లో అడ్వాన్సు చెల్లించాలంటూ ఆస్పత్రులు డిమాండ్ చేశాయి.

రూయా ఆస్పత్రికి లో చివరిగా ఓ వెంటిలేటర్ దొరకడంతో అక్కడ చేరేలోపే కొన ఊపిరి ఆగిపోయింది. పద్మావతి ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే, తన భర్త ప్రాణాలు పోయాయని తన ఇద్దరి బిడ్డలతో బోరుమని విలపించింది అతని భార్య.

Related posts

హరిహర వీరమల్లు సెట్ లో అగ్ని ప్రమాదం

Bhavani

రివ్యూ మీటింగ్: ప్రజలను మరింత అప్రమత్తం చేయాలి

Satyam NEWS

అభివృద్ధి నిర్మాణ పనులకు భూమి పూజ

Satyam NEWS

Leave a Comment