36.2 C
Hyderabad
April 25, 2024 22: 09 PM
Slider శ్రీకాకుళం

కరోనా కాలంలో డిప్యూటీ త‌హ‌శీల్దారుకే దిక్కులేని పరిస్థితి…..

#VajrapuKotturu (2)

ఈ క‌రోనా సెకండ్ వేవ్ మూలంగా సామాన్యుల‌తో పాటు  ప్ర‌భుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్న పెద్ద పెద్ద త‌ల‌కాయ‌లంద‌రూ  దాని బారిన ప‌డి ఏకంగా ప్రాణాల‌నే పొగొట్టుకుంటున్నారు.

విజయనగరం జిల్లాలో పోలీస్ శాఖప‌రంగా  ఇప్ప‌టివ‌ర‌కు అందించిన స‌మాచారం మేర‌కు 95 మంది క‌రోనా మూలంగా అటు హాస్ప‌ట‌ల్స్ లోనూ ఇటు హోం ఐసోలేష‌న్ లో ఉండ‌గా నలుగురు  ప్రాణాలు కోల్పోయారు.

ఇక రెవిన్యూ శాఖ‌కు సంబంధించి… చాలా మంది మంచాన ప‌డిన కొంద‌రు హోంఐసోలేష‌న్ లో  కొంద‌రు, హాస్ప‌ట‌ల్ లో చికిత్స  పొందుతున్న కొంద‌రున్నారు. సాక్షాత్ జాయంట్ క‌లెక‌ర్టే క‌రోనా బారిన ప‌డి చికిత్స పొందుతున్నారు.

ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌లో శ్రీకాకుళం జిల్లా వ‌జ్ర‌పు కొత్తూరు డిప్యూటీ త‌హ‌శీల్దార్ ముర‌ళీ కృష్ణ  క‌రోనా బారిన ప‌డి ఓ ప్రైవేటు హాస్ప‌ట‌ల్ లో చికిత్స పొందుతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో ప్రైవేటు హాస్ప‌ట‌ల్ ప‌ని తీరు, ఆక్సిజ‌న్ స‌దుపాయం వంటి అంశాల‌పై మీడియా కు తెలియ ప‌రుస్తూ  సెల్ఫీ ద్వారా స‌మాచారం ఇచ్చారు. డ‌బ్బులు పెట్టి మరీ  ప్రైవేటు హాస్ప‌ట‌ల్ లో  చేరితో…వేల‌కు వేలుపిండుతున్నారే త‌ప్ప‌…న‌యం చేసి తిరిగి ఇంటికి పంపించ‌డం లేద‌ని స్వ‌య‌నా డిప్యూటీ త‌హ‌శీల్దార్ వాపోతున్నారు.

ఈ సెకండ్ వేవ్ క‌రోనా ఎంత ప‌ని చేస్తోందంటే…. ప్రాణాలు నిలిచేట్టు లేవు. ఆయన తల్లి గురించి కూడా ఎంతో తపన పడుతున్నారాయన…….

Related posts

ప్రశాంతంగా ముగిసిన టీఎస్ పి సెట్ పరీక్షలు

Satyam NEWS

జ్యోతిబా పూలే కు మంత్రి ఈటెల రాజేందర్ ఘన నివాళి

Satyam NEWS

కేసీఆర్ ని కలిసిన పువ్వాడ

Bhavani

Leave a Comment