37.2 C
Hyderabad
March 28, 2024 17: 56 PM
Slider నల్గొండ

కరోనా నియంత్రణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలి

#Corona Controle

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లింగగిరి PHC  పరిధిలోని అంజలిపురం గ్రామంలో కరోనా సోకి హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయట తిరుగుతున్నారని గ్రామస్తుల సమాచారం మేరకు మండల వైద్యాధికారి Dr. లక్ష్మణ్ గౌడ్ ,ASI అంజయ్య  గ్రామాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుకున్నారు.

ఈ సందర్బంగా Dr.లక్ష్మణ్ గౌడ్  మాట్లాడుతూ కరోనా వ్యాధి నిర్మూలన ప్రతి ఒక్కరి సామజిక బాధ్యత అన్నారు. కరోనా సోకిన రోగులపై , వారి కుటుంబాలపై వివక్షత చూపవద్దని, తోచిన సహాయం చేయాలని, వారికి కావలసిన మంచి నీరు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు  అందించేందుకు గ్రామ సర్పంచ్, కార్యదర్శులు ,స్వచ్చంద సంస్థలు, గ్రామ యువత ముందుకు రావాలని కోరారు.

కరోనా పాజిటివ్ వ్యక్తులు, వారి సంబంధిత వ్యక్తులు 17రోజులు తమ ఇంటిలో తప్పకుండా స్వీయ సంరక్షణలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్  కొప్పుల రామనర్సమ్మ నారాయణ రెడ్డి,  హెల్త్ అసిస్టెంట్ ఇందిరాల రామకృష్ణ, ఆశా కార్యకర్త గొర్రె సుజాత,  గ్రామ కార్యదర్శి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేంద్రంలో ఓబీసీ ప్రత్యేక మంత్రిత్వ సాధనకై 9న మహా ధర్నా

Bhavani

నరసరావుపేటలో గోపిరెడ్డి రాజ్యాంగం అమలు చేస్తే సహించేది లేదు

Satyam NEWS

ఏప్రిల్ 10వ తేదీ నుండి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment