39.2 C
Hyderabad
April 25, 2024 16: 37 PM
Slider కృష్ణ

ఇంద్రకీలాద్రిపై కరోనా ఆంక్షలు

#indrakeeladri

విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ ప్రకటించారు. ఆలయంలో పలు సేవలు పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఆలయంలో దుర్గమ్మ అంతరాలయ దర్శనం, శఠారి పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించారు. అన్ని ఆర్జిత సేవలకు 50 శాతం మాత్రమే భక్తులను అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో ఉచిత ప్రసాదాల పంపిణీ నిలుపుదల చేసినట్లు తెలిపారు. దుర్గమ్మ దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులకు అవకాశం ఇస్తున్నామని.. మాస్కు లేని భక్తులకు అనుమతించడం లేదన్నారు. ఇంద్రకీలాద్రిపై తక్కువ మొత్తంలోనే ప్రసాద విక్రయాలు నిర్వహిస్తున్నట్లు ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. కొవిడ్​ ఉద్ధృతి నేపధ్యంలో ఆంక్షలు అమలు చేస్తున్నామని.. భక్తులు సహకరించాలని ఈవో కోరారు.

Related posts

విలేజ్ గాడ్: వైభవంగా పోలేరమ్మ విగ్రహ ప్రతిష్టాపన

Satyam NEWS

పార్లమెంట్‌లో కొనసాగుతోన్న వాయిదాల పర్వం

Bhavani

హ‌త్య‌కు నిర‌స‌గా మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని టీడీపీ ఆందోళ‌న‌

Sub Editor

Leave a Comment