24.7 C
Hyderabad
March 29, 2024 08: 02 AM
Slider మెదక్

కరోనా నిబంధనలు పాటించని మండల విద్యాధికారి

#siddipet

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధి  పరిధిలోని లచ్చపేట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నతపాఠశాల కు గోడలకు పెయింట్ వేయడానికి దాతల సహకారంతో నూట ఇరవై లీటర్ల పెయింట్ ను సేకరించినట్టు దుబ్బాక మండల విద్యాధికారి   జోగు ప్రభుదాస్ తెలిపారు.

నూట ఇరవై లీటర్ల పెయింట్ ను బత్తిని రవి, చంద్రం, మిర్దొడ్డి వేణులు విరాళాలుగా ఇచ్చారు. దాతలు స్కూలుకు పెయింట్ డబ్బాలను విరాళం  అందజేసే కార్యక్రమంలో   మండల విద్యాధికారి స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విద్యాధికారి ప్రభుదాస్ కరొనా నిబంధనలు పాటించకుండా మాస్క్ కూడా ధరించలేదు.

కరొనా నిబంధనల ప్రకారం మనిషి మనిషికి   ఒక అడుగు దూరంలో  కచ్చితంగా మాస్కు ధరించాలనే నిబంధన ఉన్నా అది ఇక్కడ   పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Related posts

మత ప్రచారం చేస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగులు

Satyam NEWS

టీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ సస్పెన్షన్?

Satyam NEWS

పండిత ఉపాధ్యాయుల సమస్యలు తీర్చాలి

Bhavani

Leave a Comment