27.7 C
Hyderabad
March 29, 2024 03: 30 AM
Slider విశాఖపట్నం

కరోన వైరస్ సెకండ్ వేవ్..ప్లీజ్ బీ కేర్ ఫుల్..! -రేంజ్ డీఐజీ హెచ్చరిక..!

#VizagDIG

అర్హులైన అందరూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు సూచించారు. అదే సమయంలో, మాస్క్ లు దరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం,సోషల్ డిస్టెన్స్ పాటించడం మొదలైన నిబంధనలను పాటించడంలో  కరోనా వైరస్ కట్టడికి వీలవుతుందని, విశాఖ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల   ప్రజలు సహకరించాలని కోరారు.

కరోన వైరస్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. రేంజ్ పరిధిలో ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతున్నా కొందరు ఇదేమి పట్టనట్లు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తమ భద్రత, ఇతరుల రక్షణను విస్మరించి మాస్కులు లేకుండా సంచరిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలు తమ వంతు బాధ్యతను గుర్తించి,  ఇతరుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని  తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని రేంజ్ డీఐజీ రంగారావు  కోరారు.

కొందరు ప్రజలు నోరు, ముక్కు  కప్పి ఉంచేలా మాస్క్ కట్టుకోకుండా  నామమాత్రంగా వేసుకుంటున్నారని, దీనివల్ల వైరస్ సోకే ప్రమాదముందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని తప్పనిసరిగా ప్రతీ ఒక్కరూ మాస్క్ లు ధరించాలని సూచించారు. దీంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. నిత్యావసరాలు, కూరగాయలు, మందులు, తదితర దుకాణాలకు వెళ్లిన సందర్భాలలో సోషల్ డిస్టన్స్ పాటించాలని సూచించారు. షాపింగ్ మాల్స్, దుకాణాల యజమానులు కూడా దుకాణాల వద్ద ప్రజలు బౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కరోనా వైరస్ నియంత్రణలో నిర్లక్ష్యంగా  వ్యవహరించే వారిపై,  నిబంధనలు ఉల్లంఘిచే  వారిపై పోలీస్ శాఖ కేసులు నమోదు చేస్తామని అన్నారు. కోవిషీల్డ్ , కొవ్యాగ్జిన్ వ్యాక్సిన్ లు భారత దేశం ప్రపంచ దేశాలకు పంపిణీ చేస్తుందని, ప్రజలందరు  ఈ వ్యాక్సిన్  పట్ల ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని, ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ గురించి  ప్రభుత్వం విడుదల చేసే (ఆరోగ్య శాఖ) నియామ నిబంధనలు పాటించాలన్నారు.   

ఇప్పటికే కొంత మంది ప్రజలు మూడు జిల్లాల పోలీసులు మొదటి డోసు తీసుకున్నారని సెకండ్ డోస్ డాక్టర్ సలహా మేరకు 4 నుండి 8 వారాలు మధ్యలో తీసుకోవాలని సూచించారు.

Related posts

వైసీపీ నాయకుడి వేధింపులతో వీఓఎ అధ్యక్షురాలు ఆత్మహత్య

Satyam NEWS

కాగజ్‌నగర్‌లో మావోయిస్టు పోస్టర్ల కలకలం

Sub Editor

24 న సూర్యాపేటకు కేసీఆర్

Bhavani

Leave a Comment