37.2 C
Hyderabad
March 29, 2024 17: 18 PM
Slider వరంగల్

కరోనా తగ్గలేదు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

#Mulugu Collector

కరోనా వ్యాధి తగ్గుముఖం పట్టలేదని రెండవ దఫా విజృంభించే అవకాశం ఉందని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్-19 వ్యాధి ప్రారంభం అయినప్పటి నుంచి జిల్లాలో నిరంతరం కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

ఇటీవల కేసులు తగ్గుముఖం పట్టినా, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పెరిగే అవకాశం ఉందని అన్నారు. కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ మార్కులను ధరించి, సామాజిక దూరం పాటించాలని, నిత్యం చేతులను సానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని సూచించారు.

జిల్లాలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం కొరకు ప్రతిపాదనలు ఇస్తే కేటాయిస్తామన్నారు. ఎస్సి కమ్యూనిటీ హాల్ కొరకు రూ. 50 లక్షలు మంజూరయిన ఇంకనూ పనులు చేపట్టలేని విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో బస్ డిపో ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు.

గిరిజన సంక్షేమ భవనాన్ని స్వాధీనం చేసుకొని, వినియోగానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో ఆర్టీవో కార్యాలయ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో పారిశుద్ధ్యం ఎంతో మెరుగుపర్చినట్లు ఆయన అన్నారు. రానున్న రోజులలో నివర్ తుఫాన్ వచ్చే అవకాశం ఉండడంతో రైతులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికే తరలించిన ధాన్యంను తడవకుండా టార్పాలిన్ లను సిద్ధం చేయడం జరిగిందని అన్నారు.

జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.  త్వరలోనే డిజిటల్ ఎక్స్ రే టెక్నికల్ సిబ్బందిని నియమించడం తోపాటు, మార్చురీ గదిలో మృతదేహాలను భద్రపరచడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

జిల్లాలో 55 శాఖలు ఉన్నాయని ప్రతి శాఖలో ప్రస్తుతం సిబ్బంది కొరతతో ఉన్నప్పటికీ ఉన్న సిబ్బంది తో పనులు పూర్తి చేస్తామన్నారు. గ్రామాల్లో వైకుంఠదామాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులు చురుగ్గా సాగుతున్నాయని, పలు చోట్ల ఇప్పటికే పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.

ప్రజలు సమర్పిస్తున్న విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని, శాఖల వారీగా పెండింగ్ విజ్ఞప్తులపై సమీక్ష నిర్వహించి త్వరితగతిన పరిష్కరించేట్లు చర్యలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. కలెక్టర్ కార్యాలయనికి కిలో మీటర్ల దూరంలో అన్ని శాఖల కార్యాలయాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

గిరిజన యూనివర్సిటీ నెలకొల్పడానికి స్థలాన్ని కేటాయింపుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులకు గురి కాకుండా ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. సమస్యలను దృష్టికి తెస్తే పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

Related posts

అంగరంగ వైభవంగా  గణనాథుని శోభాయాత్ర

Satyam NEWS

కేంద్ర బడ్జెట్లో అసంఘటిత రంగ కార్మికులకు అన్యాయం

Satyam NEWS

ప్రజా పాలనలో వనపర్తి ఎమ్మెల్యే తూడి

Satyam NEWS

Leave a Comment