39.2 C
Hyderabad
April 25, 2024 17: 27 PM
Slider వరంగల్

కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్

#CPMMulugu

ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న కరోనా ను తక్షణమే ఆరోగ్యశ్రీ లో చేర్చి మెరుగైన వైద్యం అందించి ప్రజలను కాపాడాలని  సీపీఎం ములుగు జోన్ ఏజెన్సీ  నాయకులు గుండెబోయిన రవిగౌడ్ ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.

అలాగే  కరోనా బాధితులకు (పౌష్టికాహారం) తక్షణ సహాయం కొరకు కరోనా విపత్తు నిధి కింద పదివేలు ఇవ్వాలని  అలాగే  మృతుల కుటుంబాలకు  ముప్పై లక్షల ఎక్స్గ్రేషియా అందించి ఆదుకోవాలని అన్నారు.

క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న  ఆశలకు, ప్రభుత్వానికి  ప్రజలకు వారధిగా పనిచేస్తున్న విలేకరులకు పిపిఇ కిట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

రైతు రుణమాఫీ ఒకేసారి చేయాలని కోరారు. ఆశాలకు ఫిక్స్ డ్ వేతనం  ప్రకటించాలని  అవినీతి కేసులో దొరికిన  ఉద్యోగులను సస్పెండ్ చేసి  కొన్ని రోజులు తర్వాత  మళ్ళీ  వారికీ ఉద్యోగం  ఇచ్చి  అవార్డ్స్ ఇవ్వడం  సరియైన పద్ధతి కాదని అన్నారు.

కరోనా నియంత్రణ కోసం ముందు వరుసలో  పనిచేస్తున్న  ఆశా, గ్రామ పంచాయితీ సిబ్బంది ని  పర్మినెంట్  చేయని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

కరోనాతో మంట కలిసిన మానవత్వం

Satyam NEWS

ఇద్దరు పిల్లల తల్లిని దారుణంగా కొట్టిన భర్త

Satyam NEWS

నాడు మొక్క‌- నేడు చెట్టు: 2015 లో మామ‌డలో మొక్క‌ నాటిన సీయం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment