37.2 C
Hyderabad
March 29, 2024 19: 08 PM
Slider మహబూబ్ నగర్

మహబుబ్ నగర్ లో అధునిక కరోనా వైరస్ టెస్టింగ్ ల్యాబ్

srinivasagowd

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న ముందస్తూ జాగ్రత్తలు, అవగాహన కార్యక్రమాల వల్ల వైరస్ విస్తరించకుండా పూర్తి నియంత్రణలో ఉందన్నారు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్.

మెదట్లో కరోనా వైరస్ టెస్టుల కోసం పూణ లో ఉన్న నేషనల్ ల్యాబ్ కు శాంపిల్స్  పంపి వ్యాధి ఉందో లేదో నిర్థారణ చేసేవారు. ల్యాబ్ టెస్టింగ్ రిపోర్టు రావటానికి చాలా సమయం పట్టేది. ఆ ఇబ్బంది లేకుండా మహబుబ్ నగర్ జిల్లాలో రాబోయే 10 నుండి 15 రోజుల్లో కరోనా వైరస్ టెస్టింగ్ అధునిక లేబరేటరీని ప్రారంభించబోతున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

అధునిక సాంకేతికమైన ఈ ల్యాబ్ లో కరోనా పరీక్షల ఫలితాలు 24 గంటల్లో వెలువడుతాయన్నారు. నూతనంగా మహబుబ్ నగర్ లో ఏర్పాటు చేస్తున్న ఈ ల్యాబ్ లో రోజుకు సుమారు 120 మంది నుండి 150 వరకు కరోనా పరీక్షలను టెస్టింగ్ చేయుటకు అవకాశం వుందన్నారు. కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణ అయిన తరువాత ఈ ల్యాబ్ ను పలు రకాల వైద్య పరీక్షలు అనగా H1N1 (సార్స్), స్వైన్ ప్లూ మరియు ఇతర రకాల వైరస్ టెస్టుల కోసం ఉపయోగించుకోవచ్చునని ఆయన అన్నారు.

Related posts

ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్ధికంగా ఆదుకునే బడ్జెట్

Satyam NEWS

రఘురామ లేఖ: థర్మోకోల్ ఇళ్లతో ఎవరికి ప్రయోజనం?

Satyam NEWS

కరోనా ఇవ్వాళ కాకపోతే రేపు పోతుంది మరి కులం?

Satyam NEWS

Leave a Comment