33.2 C
Hyderabad
April 26, 2024 01: 37 AM
Slider వరంగల్

బండారుపల్లి లో కరోనా టెస్ట్ లు..7మందికి సోకిన వైరస్

#Corona Tests

ములుగు జిల్లా ములుగు మండలంలోని రాయినిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారుల ఆదేశాల మేరకు గురువారం రోజున బండారుపల్లి గ్రామపంచాయతీ లోని హెల్త్ సబ్ సెంటర్,లో 25 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా బండారుపల్లికి చెందిన వారు 5 గురికీ ఇతర గ్రామానికి చెందిన వారు 2 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ అసిస్టెంట్ భానోత్ వెంకన్న  తెలిపారు.

ములుగు సివిల్  ఆస్పత్రిలో కరోనా టెస్ట్ లు నిర్విరామంగా కొనసాగుతున్నాయని, పరీక్షల కోసం వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. టెస్ట్ ల్లో కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ అయితే వారు ఇంటి దగ్గరే ఉండాలని సూచించామన్నారు.

కరోనా సోకిన వారికి ప్రత్యేకంగా ఇంచర్ల లోని  గట్టమ్మ వద్ద గురుకులంలో ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. వైరస్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మాస్క్ ధరిస్తూ పలు జాగ్రత్తలు పాటించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సత్య వతి, భానోత్ ఉష. పంచాయతీ కార్యదర్శి కూచన సతీష్, ఆశా కార్యకర్తలు చుంచు మంజుల, కందుకూరు వాణి, బుడిమల్ల రమ,తదితరులు పాల్గొన్నారు

Related posts

6న వైకుంఠ ఏకాద‌శి, 7న వైకుంఠ ద్వాద‌శికి ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ లో బార్ లపై కరోనా ట్యాక్స్

Satyam NEWS

Leave a Comment