40.2 C
Hyderabad
April 24, 2024 17: 18 PM
Slider వరంగల్

గ్రామాలలో కరోనా టెస్టులు ఎక్కువగా చేయాలి

#MuluguHealth

గ్రామంలో ప్రతి ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని ప్రజల్లో అవగాహన కల్పించాలని ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య కోరారు. జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు రాయిని గూడెం  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు.

అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, కొత్తగా గ్రామంలో కి ఎవరైనా విదేశాల నుండి ముఖ్యంగా ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చిన వారు ఎవరైనా గ్రామాలకు  వచ్చినట్లయితే  వారి వివరాలను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. రిజిస్టర్లో నమోదు చేసుకొని, వివరాలను జిల్లా కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించారు.

గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా వ్యాక్సిణ్  వచ్చేంత వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని,  కరోనా సెకండ్ వేవ్ వైరస్ విజృంభించే అవకాశాలు, ఉన్నందున ప్రజలందరూ మాస్కులు ధరించి మాత్రమే బయటికి రావాలని కోరారు.

మనిషికి మనిషికి మధ్య ఐదు అడుగుల దూరాన్ని ఉండే విధంగా చూడాలని, విందులు వినోదాల్లో పాల్గొనకుండా చూడాలని ,సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ఆయన కోరారు.

గ్రామంలో ఎవరికైనా దగ్గు ,జలుబు, జ్వరం, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి, ఉంటే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కూనూరు మహేందర్, సత్యం న్యూస్ ములుగు

Related posts

తంబ‌ళ్ల‌ప‌ల్లె ప‌ర్య‌ట‌న‌లో టీడీపీ నేత‌ల‌పై దాడులు

Sub Editor

ప్రకాశం జిల్లాకు కన్నీరు తెప్పిస్తున్న గజెట్ నోటిఫికేషన్

Satyam NEWS

బీజేపీ లోపాల పాలన వల్లే పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు

Satyam NEWS

Leave a Comment