కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కోవిడ్-19 వాక్సినేషన్ కార్యక్రమాన్ని నేడు జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా తొలి డోస్ టీకా కామారెడ్డి DCH అజయ్ కుమార్ తీసుకొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ శోభ రాజు, జిల్లా కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్, కామారెడ్డి నియోజకవర్గంకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.