36.2 C
Hyderabad
April 25, 2024 21: 26 PM
Slider విజయనగరం

ఖాకీల‌కు క‌రోనా వాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌….27 వ‌ర‌కు…!

#Vijayanagarampolice

దాదాపు 6 నెల‌ల పాటు కరోనా విజృంభ‌ణ‌తో విజ‌య‌న‌గ‌రం జిల్లా యావ‌త్తు ను ర‌క్ష‌ణ క‌వచంలా కాపాడింది..మాత్రం పోలీసుల‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.అర్ద‌రాత్రి,అప‌రాత్రి  అని  తేడా లేకుండా ఎస్పీ ఆదేశాల మేర‌కు..దాదాను 500 మంది సిబ్బంది క‌రోనా ర‌క్క‌సి ప్ర‌బ‌లకుండా ప్ర‌జ‌ల‌కు జాగ్ర‌త్త‌లు చెప్ప‌డం…చెక్ పోస్ట్ ల వ‌ద్ద కాపలాకాయ‌డం వంటి వి చేసి త‌న శాఖ ఉన్న‌తాధికారికే జాతీయస్థాయిలో అవార్డు తెచ్చి పెట్ట‌గ‌లిగారు.

దాదాపు 450మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన  ప‌డి కోలుకుని ఎట్ట‌కేల‌కు  తిరిగి విధుల‌లో చేరారు. ఇటీవ‌ల జిల్లాకు వ‌చ్చిన క‌రోనా వ్యాక్సినేష‌న్ పంపిణీ ప్ర‌కృయ‌లో తొలుత  వైద్య ఆరోగ్య శాఖ‌కు వేసిన త‌ర్వాత రెవిన్యూ సిబ్బందికి తాజా పోలీసు శాఖ‌కు వేయనున్నారు.ఈ  మేర‌కు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోరాటం చేసిన విజయనగరం జిల్లా పోలీసులకు వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.విజ‌య‌న‌గ‌రంలో రాజీవ్ న‌గ‌ర్ లోని సీహెచ్ సీలో ఈ వ్యాక్సినేష‌న్ ప్ర‌కృయ కొన‌సాగుతోంది. ఈనెల‌27 వ‌ర‌కు ఈ ప్ర‌కృయ కొన‌సాగుతుంద‌ని..జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ తెలిపారు.

కాగా  పంచాయితీ ఎన్నికల ముందు క‌రోనా వాక్సినేషన్ తీసుకొనే అవకాశం వచ్చినప్పటికీ  ఎన్నికల ముగిసిన అనంతరం వాక్సినేషన్ వేసుకోవాల‌ని నిర్ణయం తీసుకొన్నారు.అయితే పంచాయితీ ఎన్నికలు  ప్రశాంతంగా ముగియడంతో  పోలీసులకు వాక్సినేషన్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.

Related posts

కందుకూరు బాధిత కుటుంబాలకు NRI TDP సాయం

Bhavani

కరోనా సమయంలో కాకినాడ రూరల్ జర్నలిస్టుల సంక్షేమ కమిటీ

Satyam NEWS

ప్రియా! నీవెక్కడ??!

Satyam NEWS

Leave a Comment