34.2 C
Hyderabad
April 19, 2024 21: 18 PM
Slider ముఖ్యంశాలు

కొవిడ్ వ్యాక్సిన్ పై ప్రచార వాహనాల ద్వారా అవగాహన కార్యక్రమాలు

#PIB

రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో(ఆర్ వోబి), ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రచార వాహనాలను టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్  తో పాటు విక్రమ్ సహాయ్. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఈ రోజు ప్రారంభించారు.

హైదరాబాద్ లోని  కవాడీగూడలోని సిజివో కాంప్లెక్స్ లో నేడు ఏర్పాటు చేశారు. ఈ వ్యాన్ ల  ద్వారా ప్రాంతీయ భాషలో సమాచారాన్ని తెలంగాణ లోని నాలుగు వేర్వేరు ప్రదేశాలలో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు .

ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ భారతదేశం లో తయారైన వ్యాక్సిన్ లు సురక్షితమైనవని, వదంతులను నమ్మవద్దని ప్రజలను కోరారు. “COVID-సముచితమైన” ప్రవర్తన,  భద్రతా నిబంధనలను పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

“మీరు టీకాలు వేయించారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, సార్స్-CoV-2 ట్రాన్స్ మిషన్ ఛైయిన్ లను ఛేదించడానికి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని , భౌతిక దూరం తో పాటు చేతులను తరచూ  శుభ్రంగా  ఉంచుకోవాలని” విక్రమ్ సహాయ్ అన్నారు.

నేడు జాతీయ సైన్స్ దినోత్సవం గా సర్ సి.వి.రామన్ సాధించిన విజయాలకు  గుర్తుగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబడింది. రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ రంగాల్లో భారత మహిళా విజయాలను కీర్తిస్తూ మరో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ ఫోటో ఎగ్జిబిషన్ ని సంయుక్త కార్యదర్శి విక్రమ్ సహాయ్ , సందీప్ కిషన్ ప్రారంభించారు. 

పి.ఐ.బి , ఆర్.ఓ.బి  లు ఉమ్మడిగా కోవిడ్ సంబంధిత థీమ్ లపై, కోవిడ్ వ్యాక్సిన్ ల పై  డిజిటల్ మొబైల్ వ్యాన్ ప్రచారాన్ని తెలంగాణ లోని నాలుగు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ & సికింద్రాబాద్ జంట నగరాల్లో,  రంగారెడ్డి, మెదక్ – మల్కాజ్ గిరి జిల్లాల్లో ఈ వ్యాన్లు పర్యటించి, కోవిడ్ సంబంధిత థీమ్ లు, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తారు.

ఈ కార్యక్రమంలో పీఐబీ దక్షిణ ప్రాంత డైరెక్టర్ జనరల్ ఎస్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మై గాడ్: ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఎగిరిపోయిన చిలుక

Satyam NEWS

నీట్ జాతీయ స్థాయి పరీక్ష లో ర్యాంకు సాధించిన జాన్వీత రెడ్డి

Bhavani

కీలకమైన రెండు కేసులు….: ఈ సీబీఐ కి ఏమైంది?

Satyam NEWS

Leave a Comment