36.2 C
Hyderabad
April 16, 2024 22: 29 PM
Slider నల్గొండ

కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ రావడం శుభ పరిణామం

#HujurnagarMLA

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రాంతీయ వైద్యశాలలో  శాసన సభ్యుడు  శానంపూడి సైదిరెడ్డి చేతుల మీదుగా కోవిడ్ – 19 వాక్సిన్  ప్రారంభించారు.

ఏరియా వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ కరుణ్ కుమార్, మండల వైద్యాధికారి  Dr లక్ష్మణ్ గౌడ్ ల  అధ్యక్షతన జరిగిన సమావేశంలో శానంపూడి సైదిరెడ్డి  మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అందరిని  భయపెట్టిన  కరోనా వ్యాధికి  వాక్సిన్ రావడం  శుభపరిణామమని అన్నారు.

కరోనా వైరస్ ను నిలువరించడంలో సహకరించిన వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు, మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమష్ఠి కృషితో హుజూర్ నగర్ నియోజకవర్గంలో కరోనా తీవ్రతను తగ్గించగలిగామని అన్నారు.

ప్రభుత్వ వైద్యశాలను ప్రయివేటు వైద్యశాలల కన్నా ధీటుగా మారుస్తామని అన్నారు.ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ ప్రసవాలు పెరిగాయని, వైద్యశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయటానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు.  

కరోనాపై  ముందుండి పోరాడిన  వైద్య  ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ, పోలీస్ సిబ్బందికి మొదటి దఫా టీకా  అందించనున్నట్లు తెలియజేశారు.

హుజుర్ నగర్ ప్రాంతీయ వైద్యశాల యందు  మొదటిగా పారిశుధ్య కార్మికుడు  కోటి, రెండోవది ల్యాబ్ టెక్నీషియన్  నాగు నాయక్ కు శానససభ్యుడు ఉన్నతాధికారుల సమక్షంలో టీకా  అందించారు.

ఈ కార్యక్రమంలో  డిప్యూటీ DMHO నిరంజన్, RDO వెంకా రెడ్డి, హుజూర్ నగర్ మున్సిపల్  చైర్మన్ గెల్లి అర్చన రవి కుమార్,వైస్  చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, M. P. P. గూడెపు శ్రీనివాస్,

ZPTC కొప్పుల సైదిరెడ్డి,జిల్లా ప్రోగ్రాం అధికారులు Dr.కళ్యాణ్, Dr.జయ కుమారి,Dr.రవి, H.E. శ్రీనివాసరెడ్డి, ఉద్యోగ సంఘ నాయకులు ఇందిరాల రామకృష్ణ,   బందెల రాములు, వుద్దగిరి శ్రీనివాస్,నూర్జహాన్, బందెల రాములు  ఆరోగ్య సిబ్బంది,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

శాడ్:కారు మోపెడ్ ఢీ దంపతుల మృతి

Satyam NEWS

కరోనాతో హౌసింగ్  బోర్డు డిప్యూటీ ఈఈ శ్యామల్  మృతి

Satyam NEWS

భార్యనే మోసం చేసిన ఐపీఎస్ ఆఫీసర్

Satyam NEWS

Leave a Comment