39.2 C
Hyderabad
March 29, 2024 16: 27 PM
Slider ప్రపంచం

వ్యాక్సిన్ వచ్చింది సరే…మనకు అందేది ఎలా?

#CoronaVaccine

కరోనా వ్యాక్సిన్ రెడీ అయింది కానీ మరో కీలక సమస్య ముందుకు వచ్చింది. ఈ కీలక సమస్య ఔషధ కంపెనీల నుంచి ప్రభుత్వ అధికారుల వరకూ అందరిని కలవరపరుస్తున్నది.

ఫైజర్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తో సిద్ధం అయిన విషయం తెలిసిందే. దాదాపుగా 90 శాతం మంచి ఫలితాలను సాధించిన ఫైజర్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీల టెంపరేచర్ వద్ద ఉంచాలి.

ఇది ఒక సవాల్. అయితే ఈ వ్యాక్సిన్ ను 70 డిగ్రీల మైనస్ టెంపరేచర్ వద్ద నిల్వ చెయ్యడం పెద్ద సమస్య కాదు కానీ దీన్ని రవాణా చేసేందుకు కూడా అంతే టెంపరేచర్ ను మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.

ప్రపంచంలో ఇలా శీతల కంటెయినర్లను రూపొందించే ప్రముఖ కంపెనీనే మైనస్ 40 డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్ ను ఇవ్వలేదు.

అంటే మైనస్  70 డిగ్రీల టెంపరేచర్ లో కంటెయినర్లను సరఫరా చేసే కంపెనీ ప్రపంచంలో ఎక్కడా లేదు. దాంతో ఫైజర్ కంపెనీ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ను రవాణా చేయడం పెద్ద సవాలుగా మారబోతున్నది.

ఇప్పటికిప్పుడు మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత తో కంటెయినర్లను రూపొందించడం సాధ్యం కాదు. కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచం లో కూడా ఇంత అతిశీతల రవాణా సౌకర్యం లేదు.

అందువల్ల కరోనా వ్యాక్సిన్ వచ్చినా అది మన వరకు చేరే మార్గం కనిపించడం లేదు.   

Related posts

రాజంపేట లో వైసీపీ రైతు దగా దినోత్సవం…

Satyam NEWS

వరికి బదులు ఆరు తడి పంటలు వేయాలి: సీఎం కేసీఆర్

Satyam NEWS

సరదాలు తీర్చుకోవడానికి ఈ ముగ్గురూ ఏం చేస్తారో తెలుసా?

Satyam NEWS

Leave a Comment