24.7 C
Hyderabad
March 29, 2024 05: 16 AM
Slider ప్రపంచం

ప్రపంచానికి శుభవార్త: కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది

#Pfizer

ఇది నిజంగా శుభవార్త. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించే ఈ వార్త అధికారికంగా కూడా ధృవీకరించారు. ప్రపంచ ప్రసిద్ధ ఔషధ కంపెనీ ఫైజర్ ఈ వ్యాక్సిన్ ను జర్మనీ లోని ప్రముఖ ఔషధ కంపెనీ బయోఎన్ టెక్ తో కలిసి రూపొందిస్తున్నది.

ఈ కంపెనీ ద్వయం రూపొందించిన ఈ వ్యాక్సిన్ దాదాపుగా 90 శాతం మేరకు మంచి ఫలితాలను సాధించింది. ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇంత మంచి ఫలితాలను సాధించలేదు. ప్రయోగాలు తుది దశకు రావడంతో బాటు ఫలితాలు 90 శాతం మేరకు ఆశాజనకంగా ఉండటంతో ఇక కరోనా కు వ్యాక్సిన్ వచ్చేసినట్లుగానే భావించాలి.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి 12 లక్షల మందిని బలిగొన్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ రావడం అంటే ప్రపంచానికి శుభవార్తే. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసిన ఫైజర్ కంపెనీ తన ప్రయోగ ఫలితాలను పూర్తిగా వెల్లడించలేదు కానీ చూచాయగా వెల్లడించింది.

ఈ ప్రయోగ ఫలితాల అంచనా ను ఫైజర్ కంపెనీ వేరే వారికి అప్పగించి రిపోర్టు తెప్పించుకున్నది. ఈ ఏడాది చివరికల్లా కనీసం రెండు కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చి ఇమ్యూనిటీని పరిశీలించాలని కంపెనీ భావిస్తున్నది.  

Related posts

Analysis: విరాళాలు ఇచ్చేవారిపై విసుర్లా?

Satyam NEWS

బిఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లిమోహన్ రాజీనామా

Bhavani

ముడిచమురు ఉత్పత్తి స్థిరంగానే : ఒపెక్ నిర్ణయం

Sub Editor

Leave a Comment