36.2 C
Hyderabad
April 24, 2024 20: 03 PM
Slider నల్గొండ

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాలి

#MinisterJagadeeshReddy

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలో పగడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని రాష్ట్ర  విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య అధికారులు, జిల్లా అధికారులతో నిర్వహించిన కోవిడ్ టీకా సన్నాహక సమావేశంలో పాల్గొని ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తో కలసి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 16 న వ్యాక్సినేషన్(టీకా) మొదటి విడత కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈనెల 16న జిల్లా ప్రారంభోత్సవం చేయనున్నామని, జిల్లాలో మొదట గుర్తించిన వారికి ప్రాధాన్యత క్రమంలో టీకా అందించాలని జిల్లా వైద్యాధికారి నీ ఆదేశించారు.

తొలిదశలో టీకా ప్రభుత్వ  మరియు ప్రైవేట్ వైద్య సిబ్బంది అలాగే అంగన్వాడీ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ముందువరుసలో ఉంది వైరస్ వ్యాప్తి నిరోధానికి తోడ్పాటు అందించిన మున్సిపల్  శానిటేషన్ సిబ్బంది, పోలీస్, రెవెన్యూ మొదలైన వారికి అలాగే 50 సంవత్సరాలు పైబడిన వారికి, 50 సంవత్సరాలు లోపు ఉండి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి టీకా అందించడం జరుగుతుందని చెప్పారు.

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత kovid నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి, భౌతిక దూరం అలాగే చేతుల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మొదటి విడత మూడు కేంద్రాలలో  30 టీకాలు  చొప్పున నిబంధనల ప్రకారం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.

కరోనా టీకా సురక్షితమైనదే

టీకా జిల్లాలోని 31 వ్యాక్సినేషన్ సెంటర్లలో 6479 లబ్ధిదారులకు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందన్నారు. ప్రపంచాన్ని గత మార్చ్ నుండి భయబ్రాంతులకు గురిచేస్తూ ఎందరో ప్రాణాలు బలిగొన్న కోవిడ్ ను తరిమికొట్టేందుకు మన రాష్ట్రంతో పాటు భారత దేశంతో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈనెల 16 నుండి  చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రజా ప్రతినిధులు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అండగా నికావాలని వారిలో నమ్మకం భరోసా కల్పించాలన్నారు.

ఈ నెల 16న లాంచనంగా జిల్లాలోని మూడు కేంద్రాల్లో ప్రారంభిస్తున్నట్లు 18నుండి31 ఎంపిక చేసిన ప్రభుత్వ ,ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం అయ్యి విజయవంతం చేయాలన్నారు .

టీకా వంద శాతం సురక్షిత మైనదని టీకా వేసుకున్న తర్వాత ఏమైనా  ఇబ్బందులు, జ్వరం, దద్దుర్లు  లాంటివి వస్తే  వెంటనే వైద్యం అందించేందుకు వైద్య నిపుణులు, సిబ్బంది  సిద్ధంగా ఉంటారని అన్నారు.

జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి  మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయుటకు పక్కాగా ప్రణాళిక రూపొందించడం జరిగింద నీ అన్నారు. టీకా తీసుకున్న  అనంతరం వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ప్రతికూల సంఘటనలు వచ్చినట్లయితే వీటిని అధిగమించేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు.

జిల్లాలో ముందస్తుగా ట్రైల్ రన్ చేపట్టి వైద్యాధికారులు, సంబంధిత శాఖల సిబ్బందికి అవగాహన కల్పించామని అన్నారు. ప్రాధాన్యతా క్రమం కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని సూచించారు.

టీకా ప్రారంభోత్సవం లో బాగంగా  పట్టణంలో గల జనరల్ ఆసుపత్రి, రాజీవ్ నగర్ లోని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అలాగే హుజూర్ నగర్ లోని ప్రాంతీయ అరోగ్య కేంద్రం లలో గుర్తించిన వారికి ప్రతి చోట 30 మందికి టీకా వేయడం జరుగుతుందని అన్నారు. మొదటి విడత  గుర్తించిన 6479 మంది లబ్ధిదారులకు టీకా వేసేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అర్.డి. ఓ లు సూర్యాపేట రాజేంద్ర కుమార్,  హుజూర్ నగర్ వెంక రెడ్డి, డి.యస్.పి. రమేష్ కుమార్,  డి.యం.హెచ్. ఓ dr. హర్ష వర్ధన్, జిల్లా అదికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

29 నుంచి బాసరలో శరన్నవరాత్రులు ఆరంభం

Satyam NEWS

డిప్యూటీ స్పీకర్ ను కలిసిన ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ పోరాట సమితి

Satyam NEWS

కౌంటర్ చెక్: పోలీసు పైశాచికత్వంపై విచారణ షురూ

Satyam NEWS

Leave a Comment