39.2 C
Hyderabad
April 25, 2024 15: 01 PM
Slider జాతీయం

కరోనా వ్యాక్సిన్ అందరికి అవసరం లేదు

#RemdesivirInj

దేశంలోని జనాభా మొత్తానికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

కరోనా వ్యాక్సిన్ దేశంలోని ప్రజలందరికి కూడా అవసరం లేదని, కేవలం ఒకరి నుంచి ఒకరికి సోకే గొలుసుకట్టును తెంచే విధంగా వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ లాంటి సున్నితమైన అంశాలలో ప్రజలకు కచ్చితమైన సమాచారం అందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశం మొత్తం కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కూడా కేంద్రం ఎప్పుడూ చెప్పలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందేందుకు అనువుగా ఉండే జన సమూహాలకు వ్యాక్సిన్ ఇస్తే కరోనా వ్యాప్తి దానంతట అదే కంట్రోల్ అవుతుందని ఆయన అన్నారు.

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పకడ్బందిగా సాగుతున్నాయని, సీరం ఇన్ స్టిట్యూట్ నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ పై కూడా మీడియాలో కొన్ని అభూత కల్పనలు వస్తున్నాయని ఆయన అన్నారు.

సీరం ఇన్ స్టిట్యూట్ నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ బాగా సాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

Related posts

విజయనగరం పైడితల్లి టెంపుల్ వద్ద కారు ప్రమాదం

Satyam NEWS

దుబ్బాకలో వందపడకల ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి హరీష్

Satyam NEWS

నో సొల్యూషన్: కిరోసిన్ డబ్బాలతో కలెక్టరేట్ ఎక్కిన రైతులు

Satyam NEWS

Leave a Comment