39.2 C
Hyderabad
March 29, 2024 14: 32 PM
Slider విజయనగరం

న‌ష్టాల వల్లే సంజీవ‌ని బ‌స్సులు ద్వారా వ్యాక్సిన్ నిలుపుద‌ల

corona vaccine

దేశ వ్యాప్తంగా మ‌ళ్లీ క‌రోనా విజృంభిస్తోంద‌న్న త‌రుణంలో మ‌రోసారి  కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. ఇంత‌వ‌ర‌కు రెండు ద‌శ‌ల‌లో ప్రభుత్వ శాఖ‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్ ఇచ్చామని విజ‌య‌న‌గ‌రం జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ అధికారిణి ర‌మ‌ణకుమారి తెలిపారు.

తొలి ద‌శ వైద్య ఆరోగ్య శాఖ‌,రెండో ద‌శ లో రెవిన్యూ శాఖ‌,మూడో ద‌శ‌లో పోలీస్ శాఖ‌కు క‌రోనా వ్యాక్సిన్  ఇచ్చామన్నారు. రెండు సార్లు క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత మూడో సారి స్థానిక ప‌రిస్థితుల  బ‌ట్టి  అవ‌స‌రం లేద‌న్నారు.

ప్ర‌స్తుతం త‌మ శాఖ ద్వారా క‌రోనా టీకాలు అన్ని ప్రాథ‌మిక కేంద్రాల‌లోనూ ఉంచామ‌న్నారు. అలాగే సీహెచ్ సీల‌లో ఉంచామన్నారు. 28 రోజుల వ్య‌వ‌ధిలో రెండో సార్లు టీకా వేయించుకోవాల‌న్నారు. టీకాల పంపిణీ విష‌యంలో ఇప్ప‌టికే రెండు సార్లు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు టీకాలు వేసామ‌ని క‌రోనా డోస్ వేసుకున్న త‌ర్వాత 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల‌ని అలాగే రెండో సారి కూడా టీకా వేసుకున్న త‌ర్వాత 28 రోజుల క్వారంటైన్ లో ఉండాల‌న్నారు.

బ‌హిరంగ ప్ర‌దేశాలు,.ప‌బ్లిక్ ప్ర‌దేశాల‌లో  సంజీవ‌నీ బ‌స్సుల‌లో వేస్తున్న కరోనా వ్యాక్సినేష‌న్ ను పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేసామ‌న్నారు.న‌ష్టాలు రావ‌డంతో..సంజీవ‌ని బ‌స్సుల ద్వారా పంపిణీ చేస్తున్న సంజీవ‌ని వ్యాక్సిన్ విధానాన్ని నిలుపు ద‌ల చేసామ‌న్నారు. వాస్త‌వానికి ఆర్టీసీ శాఖ స‌హాయంతో ఏసీ బ‌స్సులైన‌ సంజీవ‌ని ద్వారా కాంప్లెక్సులు, రైల్వే స్టేష‌న్లు,సిటీ బ‌స్సులు తిరిగే ప్రాంతాలు,మార్కెట్ల వ‌ద్ద సంజీవ‌ని మెడిస‌న్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టామ‌న్నారు.

ఆయితే ఎవ్వ‌రూ సంజీవ‌ని బస్సుల వ‌ద్ద‌కు క‌రోనా వ్యాక్సినేష‌న్ వేసుకోవడానికి రాక‌పోవ‌డంతో అటు ఆర్టీసీ ఇటు వైద్య ఆరోగ్య‌శాఖ‌కు తీవ్రంగా న‌ష్టం ఏర్ప‌డింద‌న్నారు. ఈ క్ర‌మంలోనే సంజీవ‌ని బ‌స్సుల ద్వారా క‌రోనా పంపిణీని నిలుపుద‌ల చేసామ‌ని డీఎంఅండ్ హెచ్ ఓ తెలిపారు. ఈ స‌మావేశంలో వైద్య ఆరోగ్య శాఖ సూప‌రెంటెండెంట్ ప్ర‌భు కూడా ఉన్నారు.

Related posts

మళ్లీ విజృంభిస్తున్న కాల్ మనీ రాకెట్

Satyam NEWS

రాష్ట్రంలో ఓటర్లు 3 కోట్లు

Bhavani

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్లు

Satyam NEWS

Leave a Comment