27.7 C
Hyderabad
April 20, 2024 01: 39 AM
Slider ప్రపంచం

గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకే అవకాశం

#Coronavirus

కరోనా వైరస్ పై జరుగుతున్న కొత్త ప్రయోగాలు వెల్లడిస్తున్న కొత్త విషయాలు భయం కలిగించేవిగా ఉన్నాయి. కరోనా వైరస్ అందరూ చెబుతున్నట్లు కేవలం వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు లేదా నోటి నుంచి వచ్చే తుంపరల ద్వారా మాత్రమే వైరస్ వ్యాపిస్తుందని ఇప్పటి వరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది.

అదీ కూడా ఆ తుంపరలు వేరే మనిషిపై పడినప్పుడు మాత్రమే కొత్త వ్యక్తికి కరోనా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటున్నది. అయితే అది వాస్తవం కాదని అమెరికా మరో 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని వారు అంటున్నారు.

వైరస్ సోకిన వ్యక్తి పరిసరాలలో ఈ వైరస్ సాంద్రత ఎక్కువగా ఉంటున్నట్లు ఆ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు వారు తమ సిద్ధాంత పత్రాలను కూడా ప్రచురించబోతున్నారు. అంతే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ప్రకటనను మార్చుకోవాలని వత్తిడి తీసుకువస్తున్నారు.

ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నదే నిజమైతే కరోనా వైరస్ సోకిన వారి తుంపరలు మీద పడిన వారికే కాదు వారు వదిలిన గాలి పీల్చినా కూడా ప్రమాదం పొంచి ఉన్నట్లే భావించాల్సి ఉంటుంది. తాము ఈ విషయాన్ని గత కొద్ది కాలంగా చెబుతూనే ఉన్నామని అయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ వినడంలేదని డాక్టర్  బెనిడెట్టా అలెగ్రాన్జీ అన్నారు.

Related posts

లాక్ డౌన్ ఆందోళనతో కువైట్ లో కడప జిల్లా వాసి మృతి

Satyam NEWS

క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కరం కోసమే పల్లె ప్రగతి

Satyam NEWS

లాకప్ డెత్ పై నెల్లూరు ఎస్పీకి సమస్లు

Bhavani

Leave a Comment