36.2 C
Hyderabad
April 23, 2024 22: 50 PM
Slider ప్రత్యేకం

దేశంలో కరోనా డేంజర్ జిల్లాలు ఆంధ్రాలోనే ఎక్కువ

#Coronavirus

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిలో డేజంర్ జిల్లాలను కేంద్రం ప్రకటించింది. మొత్తం దేశంలో 30 కరోనా డేంజర్ జిల్లాలు ప్రకటించగా ఆంధ్రప్రదేశ్ లోనే ఐదు జిల్లాలు ఉన్నాయి.

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కరోనా విజృంభణ అధికంగానే ఉందని కేంద్రం తాజా గణాంకాల్లో వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టివ్‌ కేసుల్లో 67 శాతం కేవలం 6 రాష్ట్రాల్లోనే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో టాప్‌-5 జిల్లాలతో కూడిన జాబితాను విడుదల చేసింది.

ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల్లో ఈ వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉన్నట్టు పేర్కొంది. ఏపీలో కరోనా విజృంభణ చాలావరకూ తగ్గినప్పటికీ ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

 మరోవైపు మరణాల సంఖ్య కూడా గతంతో పోలిస్తే భారీగానే తగ్గాయి.

Related posts

ఇంటి నీటి కుళాయిలకు మీటర్లు బిగించడం సముచితం కాదు

Satyam NEWS

సర్వే టెల్స్:75 దేశాల్లో అశాంతి అందులో భారత్

Satyam NEWS

సుబ్బారావు గుప్తా పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

Satyam NEWS

Leave a Comment