30.3 C
Hyderabad
March 15, 2025 10: 42 AM
Slider ప్రత్యేకం

కరోనా వ్యాక్సిన్: ప్రయోగ దశలు దాటడం అంత సులభమా?

#Coronavirus Vaccene

(సత్యం న్యూస్ ప్రత్యేకం పార్ట్ 2)

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ మానవాళి ఎదురుచూస్తున్న ఈ తరుణంలో ఒక్క రోజు ఒక్క గంట ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా పరిశోధనలు సాగుతున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒక్కో దశను దాటి వ్యాక్సిన్ వరకూ రావడానికి ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేరు.

ఎందుకంటే పరిపూర్ణమైన వ్యాక్సిన్ రూపొందాలంటే అన్ని దశలు దాటాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ కనిపెట్టడం నుంచి ఇన్ని లక్షల కోట్ల మంది మానవాళికి వ్యాక్సిన్ డోసేజీని స్ధిరపరచాలంటే ఎన్ని ప్రయోగాలు జరగాలి? ఒక్కో దేశంలో ఒక్కో భౌగోళిక, పర్యావరణ, జీవన విధానం ఉంటుంది.

యూనివర్సల్ వ్యాక్సిన్ తయారు కావడానికి కరోనా విషయంలో మరో అడ్డంకి కూడా ఉంది. కరోనా అనేది స్థిరమైన వైరస్ కాదు. దాని జీన్ మ్యుటేషన్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే జీ టైపు, ఎల్ టైపు అనే రకాల కరోనా వైరస్ ల విజృంభణ చూస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న అధ్యయనాలకే పలు దశలు ఉంటాయి.

ప్రీ క్లినికల్ అధ్యయనాల దశకు వచ్చిన తర్వాత మనుషుల్లో ఆశించే సెల్యులార్ ప్రతిస్పందనల కోసం పరిశోధకులు ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడు సురక్షితమైన మోతాదును కూడా సూచించవచ్చు. వ్యాక్సిన్, దాని ఇమ్యూనోజెనిసిటీ భద్రతను మదింపు చేయడం కోసం సెల్ (కణజాలం) కల్చర్, సెల్ కల్చర్ సిస్టమ్, జంతువులపై టెస్టింగ్ లను చేయాల్సి ఉంది.

ఈ ప్రయోగాలలో రోగనిరోధక ప్రతిస్పందనను గమనించేందుకు మరి కొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఐ ఎన్ డి అప్లికేషన్ అనేది మరో కీలకమైన సంస్థ. ఇది ప్రయివేటు సంస్థ. కొత్త ఔషధం కోసం ఈ సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ను ఐ ఎన్ డి ఆమోదించిన తర్వాత వ్యాక్సిన్ మూడు దశల్లో టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాతి దశలనే క్లినికల్ అధ్యయనాలు అంటారు. అందులో ఫేజ్ I  వ్యాక్సిన్ ట్రయల్స్: ఫేజ్ 1 టెస్టింగ్ లో వ్యాక్సిన్ భద్రత మదింపు చేస్తారు. అంటే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టు ను ముందుగా పరిశీలిస్తారు. తర్వాత వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని అంచనా వేస్తారు. ఆ తర్వాత దాన్ని స్టాండడైజ్ చేయాల్సి ఉంటుంది.

ఫేజ్ 1 విజయవంతంగా అధిగమిస్తే ఫేజ్ 2కు వెళతారు. ఫేజ్ II  వ్యాక్సిన్ ట్రయల్స్: ఫేజ్ II టెస్టింగ్ లో వందల మంది వ్యక్తులపై వ్యాక్సిన్ ప్రయోగిస్తారు. దీని నుంచి పరిశోధన మళ్లీ జరుగుతుంది. వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో జరిగే మార్పులను గమనించాల్సి ఉంటుంది.

వ్యాక్సిన్ భద్రత, ఇమ్యూనోజెనిసిటీ, ప్రతిపాదిత మోతాదులు, ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ సంబంధిత అంశాలపై పరిశోధన జరగాల్సి ఉంటుంది. ఈ దశకు రావడానికి ఎంతో సమయం పడుతుంది.

(ఫేజ్ 3 గురించి మరో వ్యాసంలో)

Related posts

రామప్ప దేవాలయం అభివృద్ధికి సత్వర చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

నా లాగా న్యాయం కోసం ఎదురు చేసే పరిస్థితి వద్దు

Satyam NEWS

శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న పర్యాటక మంత్రి

Satyam NEWS

Leave a Comment