29.7 C
Hyderabad
April 18, 2024 05: 47 AM
Slider జాతీయం

వార్తా పత్రికలతో కోవిడ్ అంటదని తేల్చిన సర్వే

#Newspapers

కోవిడ్ మహమ్మారి ఉధృతంగా ఉన్న ప్రస్తుత క్లిష్ట సమయంలో పత్రికలు సురక్షితమేనా? ఎటువంటి ప్రమాదం లేదంటున్నారు ఆరోగ్య శాస్త్రవేత్తలు. పేపర్ చదవనిదే చాలా మందికి దినచర్య ప్రారంభం కాదనేది నిష్టుర సత్యం.

కొత్తగా పుట్టుకొచ్చి ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మానవ శరీరంపై కనీసం తొమ్మిది రోజుల పాటు మాటు వేసి ఉంటుందట! అయితే న్యూస్ పేపర్ల వల్ల ఎటువంటి హాని ఉండబోదని ఇటీవల వెలువడిన ఒక శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది.

కోవిడ్ సమయంలో పేపర్ల ద్వారా ఎటువంటి వ్యాప్తి జరగదని స్వయంగా కేంద్రమంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. వైద్య ఆరోగ్య నిపుణుల ప్రకటన మేరకు  కరోనా వైరస్ పేపర్ డెలివరీ ద్వారా ఏమాత్రం సోకదని స్పష్టమైనట్లు కేంద్ర అరోగ్య వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఇచ్చిన హామీ  చాలా మందికి ఊరట కలిగించింది.

వార్తా పత్రికల పంపిణీ పై ఎటువంటి ఆంక్షలు విధించబోమని  కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Related posts

రోగుల్ని పీడిస్తున్న యశోదా ఆసుపత్రి వద్ద బిజెపి ధర్నా

Satyam NEWS

మాల నాగరాజు హత్యకు కొల్లాపూర్ లో నిరసన ర్యాలీ

Satyam NEWS

రెండు భారీ చిత్రాల్లో అమ్రిన్‌ ఖురేషి..

Sub Editor

Leave a Comment