37.2 C
Hyderabad
March 28, 2024 19: 56 PM
Slider ప్రత్యేకం

కరోనా వ్యాక్సిన్ తయారు అవుతున్నదా? నిజమేనా?

#Corona Virus

(సత్యం న్యూస్ ప్రత్యేకం పార్ట్1)

కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తున్నదా? పలు మాధ్యమాల నుంచి విస్తృత సమాచారం మార్కెట్ ను ముంచెత్తుతున్నందున ఈ ప్రశ్న తలెత్తడం సహజం. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ ప్రచారం చేసేవారు ఎక్కువ మంది ఉండటం కూడా ఈ కన్ఫ్యూజన్ కు ప్రధాన కారణం.

చేయడానికి సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, భారతీయ ఇమ్యూనోజిసిల్స్ లకు అనుమతి లభించిందనే వార్త కొత్త ఆశలు రేపిన విషయం తెలిసిందే. అంటే ఇక వాక్సిన్ వచ్చేస్తున్నదన్నమాట అనుకోవడం కూడా సహజం. అయితే ఇందులోని సాధకబాధకాల గురించి తెలుసుకోవడానికి సత్యం న్యూస్ సంబంధిత నిపుణులను సంప్రదించింది.

దానికి సంబంధించిన వివరాలే ఇక్కడ అందిస్తున్నాం. కరోనావైరస్ కు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఎక్కువ మంది మరణించకుండానే వ్యాక్సిన్ ఆవిష్కృతం కావాలని అందరూ కోరుకుంటున్నారు.

ఈ నెలలోనే తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విడుదల చేస్తామని ఇటలీ చెబుతోంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కు చెందిన ఇన్ స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్ (IIBR) ఒక మోనోక్లోనల్ న్యూట్రాలిటిసిన్ ను అభివృద్ధి చేసిందని, దీన్ని త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన విషయాలను చూస్తే మనుషులపై ప్రయోగాలు చేసే స్థాయికి వ్యాక్సిన్ వచ్చిందని వెల్లడవుతున్నది. అమెరికాలో ప్రముఖ ఔషధ అమ్మకందారులు ఫైజర్, బయోటెక్ కంపెనీలు కలిసి BNT162 టీకా కార్యక్రమం క్లినికల్ పరీక్షలను ప్రారంభించాయి.

ఈ దశలోనే సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) ముందుకు వచ్చి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసే అంశంలో తాము ఎంతో ముందుకు వెళ్లిపోయామని ప్రకటించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ తన వ్యాక్సిన్ ఫేజ్-1 హ్యూమన్ క్లినికల్ ట్రయల్ ని ఏప్రిల్ 23 నాడు ప్రారంభించింది.

జెన్నర్ ఇనిస్టిట్యూట్ మూడు నెలల కిందట దీన్ని అభివృద్ధి పరచింది. ఇలా చాలా దేశాలలోని పరిశోధనా సంస్థలు ఇప్పటికే తమ తమ ఆవిష్కరణల గురించి చెప్పాయి. అంటే పైన చెప్పిన లెక్కల ప్రకారం వ్యాక్సిన్ వచ్చేస్తున్నట్లేగా? అవును వ్యాక్సిన్ వచ్చేస్తున్నట్లే. అయితే ఎంత కాలానికి? అదే ఇప్పుడు కీలక ప్రశ్న.

వ్యాక్సిన్ రూపొందించడం క్లీనికల్ ట్రయల్ చేయడం అంత సులభంగా కొన్ని రోజులలో జరిగే ప్రక్రియ కాదు. క్లీనికల్ ట్రయల్స్ లో ఎన్నో సంక్లిష్టతలు ఉంటాయి. అంత సులభంగా ఒక నిర్ణయానికి వచ్చే వీలు ఉండదు. వ్యాక్సిన్ అభివృద్ధి అనేది సుదీర్ఘ, సంక్లిష్ట ప్రక్రియ.

ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంతో జరిగే ఈ పని మొత్తం ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో కొనసాగుతూనే ఉంటుంది. తుది రూపానికి రావడం, దానిపై ప్రభుత్వాలు, ఇతర సంబంధిత పరిశోధనా సంస్థలు అంగీకారం తెలపడం మరింత కష్టమైన దశ.

అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ బయోలాజిక్స్ పరిశోధన, వ్యాక్సిన్లు, ఇతర ఔషధాల నియంత్రణ పర్యవేక్షిస్తుంది. యూరోప్ లో యూరోపియన్ ఔషధాల ఏజెన్సీ వ్యాక్సిన్లు, ఇతర ఔషధాల నియంత్రణ పర్యవేక్షిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కమిటీ అంతర్జాతీయంగా ఉపయోగించే జీవ ఉత్పత్తులకు సిఫార్సులు చేస్తుంది.

చాలా దేశాలు WHO ప్రమాణాలను పాటిస్తాయి. వ్యాక్సిన్ తయారు చేయడానికి ప్రయోగ శాల అధ్యయనాల నుంచి జంతువులపై అధ్యయనం చేసే స్థాయికి రావడానికి సాధారణ సందర్బాలలో చాలా సమయం పడుతుంది. ప్రాథమిక ప్రయోగశాల పరిశోధన సాధారణంగా 2 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. ప్రాథమికంగా శాస్త్రవేత్తలు ఒక వ్యాధిని నిరోధించడానికి లేదా చికిత్సకు సహాయపడే సహజ లేదా కృత్రిమ యాంటీజెన్ లను గుర్తించాలి.

ఈ యాంటీజెన్స్ లో వైరస్ వంటి కణాలు, బలహీనమైన వైరస్ లు లేదా బాక్టీరియా, బలహీనమైన బాక్టీరియా విషాన్ని, లేదా వ్యాధికారక పదార్థాల నుండి ఉత్పన్నమైన ఇతర పదార్ధాలను చేర్చవచ్చు. పూర్వ క్లినికల్ దశ సాధారణంగా 1-2 సంవత్సరాలు ఉంటుంది.

(మిగతా భాగం రేపు)

Related posts

కమలం గూటికి సుభాష్ రెడ్డి: ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ కి షాక్

Satyam NEWS

తవ్వి వదిలేసిన రోడ్లతో తంటాలు పడుతున్న ప్రజలు

Satyam NEWS

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దివ్యాంగులు ర్యాలీ

Satyam NEWS

Leave a Comment