39.2 C
Hyderabad
March 29, 2024 16: 11 PM
Slider కరీంనగర్

పేదల చెంతకు కార్పొరేట్ వైద్యం చేరువ చేస్తున్నాం

#EtalaRajendar

పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి ఆదుకోడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో వుందని ఈమేరకు ఇప్పటికే వైద్యరంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.

ఆదివారం హుజురాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో92 మంది లబ్దిదారులకు రూ.38 లక్షల 34వేల 500 విలువ చేసే చెక్కులను మంత్రి అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య పరికరాలు, అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు.

రానున్న రోజుల్లో  కార్పొరేట్ వైద్యం పేదల దరి చేర్చి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రి వెంట నాయకులు బండ శ్రీనివాస్,

కొలిపాక శ్రీనివాస్, గందే శ్రీనివాస్, కన్నెబొయిన శ్రీనివాస్, సందమల్ల బాబు, పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

Related posts

శ్రీ‌రామ నామ ‌స్మ‌ర‌ణ‌తో పులకించిన తిరుమలగిరులు

Sub Editor

పీవీ ఆర్ధిక సంస్క‌ర‌ణ‌లు ప్ర‌పంచానికి దిక్సూచీ

Sub Editor

ఏ కంపెనీ వ్యాక్సిన్ ఏ దశలో ఉందో తెలుసా?

Satyam NEWS

Leave a Comment