కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు చేయుత అందించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ లోన్లు మంజూరు చేస్తే అవి నందలూరు మండలంలో పక్కదారి పడుతున్నాయి. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో కూటమి ప్రభుత్వం ఒక ఉన్నత ఆశయాలతో బీసీ వర్గీయుల లో అల్ప వర్గాల అభ్యున్నతి కోసం బీసీ సబ్సిడీ లోన్లను మంజూరు చేశారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు.
బ్యాంకర్ ల సమక్షంలో అధికారులు ఈ పథకానికి లబ్ధిదారులును ఇంటర్వూ లో ఎంపిక చేయాల్సి ఉండగా, అలా జరగలేదు. అలా కాకుండా పార్టీ కోసం చిరకాలంగా కష్టపడిన వారికి కాకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, బినామీలకు స్వయానా కూటమి లో ఉన్న నాయకులే స్వయంగా పథ కాలు పొందారు.ఇందుకోసం 52 యూనిట్ల కోసం, 379 మంది లభిదారుల ఇంటర్యులు నిర్వహించారు. అయితే ముందే బినామీలు, కోవర్ట్ లను ఎంపిక చేసినట్లు తెలిసింది. వారు ఇంటార్యులకు హాజరు కాలేదని చెబుతున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తమ కష్టాలు తీర్థాయని ఆశించిన పేద ప్రజలకు నాయకుల స్వార్థం మూలంగా నిరాశ మిగిలింది. ఇంక సగటు మనిషికి ఈ పథకాలు ఎప్పుడు పొందుతారు. ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు పథకం పొందాలంటే యే అర్హత ఉండాలి, నిరుద్యోగమా, చిన్నపాటి వ్యాపారమా లేదా కొత్తగా యూనిట్లు ప్రారంభం చెయ్యడానికి, ఇప్పుడు లబ్ధి పొందినవారు ఆ కోవకు చెందినవారు ఒక్కరూ కూడా లేరు.
కేవలం ఓకె కుటుంబ సభ్యులకు, మరియు బడా ఫ్యాక్టరీ హోటల్స్, మాల్స్ నడుపుతున్న వారికి 20 నుంచి 30 లక్షలు ఖరీదు కల్గిన వాహనదార్లుకు కూడా ఈ పథకం లో చోటు లభించింది అంటే అర్థం చేసు కోవచ్చు 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం తర్వాత తిరిగి ఇప్పుడు అధికారంలోకి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం కార్పొరేషన్ లోన్లు కోసం శ్రీకారం చుట్టింది. నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా అల్ప స్థాయి వర్గీయులకు ఇలాంటి పథకాలు కేటాయించి ప్రభుత్వానికి మంచి పేరు,గొప్ప స్థానం తేవాలి.
కానీ బినామీ లతో స్వయానా సబ్సిడీ పథకాలను దిగమింగడం ఎంత వరకు సబబో అర్థం కావడం లేదు.రాష్ట్ర మంతా కూటమి అభ్యర్థులు గెలిచినా,రాజంపేట నియోజక వర్గంలో మాత్రం ఇటువంటి స్వార్థ ప్రయోజనాలతో టీడీపీ అభ్యర్థి ఓడిపోయారు.రాబోవు స్థానిక ఎన్నికల లో దీని ప్రభావం కచ్చితంగా పడే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వ ఆశయం గొప్పదే,కానీ స్థానిక నాయకత్వ ప్రలోభలా వల్లే కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నది.ఈ లబ్ధి దారులనుయే అర్హత కింద వీళ్ళకు కేటాయించారో,ఎంపిక చేసిన అధికారులకే తెలియాలి.ఇప్పుడు ఎంపిక చేసిన లబ్దిదారుల ఇండ్లకు వెళ్లి విచారణ జరిపి నిజమైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.