వనపర్తి మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలు ఉన్నాయని, విచారణ చేయాలని అఖిలపక్షం ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ కోరారు. గత నాలుగు సంవత్సరాల క్రితం 67 లక్షలు పైగా ఖర్చు చేసి తెచ్చిన సెకండ్ హ్యాండ్ స్వీపింగ్ మిషన్ మూలకు పెట్టారని, కమిషన్ తీసుకున్నారని అయన విమర్శించారు. స్విపింగ్ యంత్రానికి పూజ చేసి నివాళులు అర్పించామని చెప్పారు. నాలుగు సంవత్సరాల క్రితం ప్రజల సొమ్ముతో పనికిరాని స్వీపింగ్ మిషను తెచ్చి (ఘాట్లో) మూలకు పెట్టేశారని, అంతేకాకుండా పాత జె.సి.బి ని, ట్రాక్టర్లను, ఇతర పాత సామాన్లు ఎలాంటి టెండర్ లేకుండా రాత్రికి రాత్రి అమ్ముకున్నారని తెలిపారు.
కోట్లల్లో. అవన్నీ ప్రజల డబ్బు ఉందని, అవినీతి జరుగుతున్నా ,చూచి చూడనట్లు ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, విచారణ జరిపించాలని ఐక్యవేదిక కోరుతున్నా పట్టించుకోకుండా ఉన్నారని చెప్పారు. ప్రజలతో చెత్తకు టాక్స్,నీటికి టాక్స్, ఇంటికి టాక్స్ వసూలు చేస్తున్నారని తెలిపారు. త్వరలో కొందరి అవినీతి,అన్ని వార్డుల వారీగా సమస్యలు, అభివృద్ధి ప్రజల ముందు ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తోపాటు టిడిపి రాష్ట్ర నాయకుడు కొత్త గొల్ల శంకర్, కాంగ్రెస్ నాయకుడు వెంకటేష్, బీఎస్పీ టౌన్ అధ్యక్షుడు గంధం భరత్, నాయకుడు బొడ్డుపల్లి శంకర్, బీసీ నాయకుడు గౌనీకాడి యాదయ్య, లోక్సత్తా నాయకుడు రాజ్ కుమార్, బిజెపి నాయకులు రవి, శివకుమార్, రమేష్, నాగరాజు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్