ఏలూరు జిల్లాలో ఓ పంచాయతీ లో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలతో విచారణ జరుగుతున్నట్టు సమాచారం. ఈ విచారణ లో ఆ పంచాయతీ సర్పంచ్ పాత్ర ఉన్నట్టు రుజువైతే చెక్ పవర్ రద్దు కాకుండా చూస్తానని ఆ పంచాయతీ లో పని చేసే ఒక ఉద్యోగి సర్పంచ్ కి అభయమిచ్చినట్టు సమాచారం. సర్పంచ్ భర్త చేత గోల్డ్ తాకట్టు పెట్టించి సుమారు లక్ష రూపాయలు నగదు సర్పంచ్ చేతుల మీదగా ఆ ఉద్యోగి ఒక అధికారి చేతుల్లో పెట్టించినట్టు విశ్వసనీయ సమాచారం.
సదరు అధికారిని ఆ పంచాయతీ కి వీజిట్ పేరుతో ప్రత్యేకంగా పిలిపించి సర్పంచ్ తో ఆ అధికారికి ముడుపులు ముట్ట జెప్పించారని ఆ పంచాయతీ లో చెప్పుకుంటున్నట్టు సమాచారం. సొమ్ములు సమర్పించినప్పటికీ నిధుల దుర్వినియోగం పై భారీ ఎత్తున జరుగుతున్న విచారణ తీరును చూసి ఆ ఉద్యోగి చెక్ పవర్ ని కాపాడతానని ఇచ్చిన భరోసా పై నమ్మకం కోల్పోయిన సర్పంచ్ మానసిక వేదనకు గురై ముడుపులు తీసుకుని కూడా చెక్ పవర్ ఎక్కడ రద్దు చేస్తారో అనే అభద్రతా భావం తో ఆ సర్పంచ్ ముందుగానే న్యాయ స్థానాన్ని ఆశ్రయించినట్లు చెప్పుకుంటున్నారు.
రాష్ట్రంలో ఉన్మాద పాలన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి