38.2 C
Hyderabad
April 25, 2024 14: 22 PM
Slider ముఖ్యంశాలు

సీజన్ చివరి వరకు సీసీఐ కొనుగోళ్లు జరిగేలా చూడాలి

#CottonCorporation

ఆదిలాబాద్  జిల్లాలోని అన్ని సెంటర్లలో  సీసీఐ పత్తి కొనుగోళ్లు  ప్రారంభించడంతో పాటు  సీజన్​ చివరి పంట విక్రయం వరకు సీసీఐ ద్వారా నే కొనుగోళ్లు జరిగేలా చూడాలని  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసినిరెడ్డి  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డిని  కోరారు.  

గురువారం హైదరాబాద్​లో   కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాటన్​ కార్పోరేషన్  ఆఫ్​ ఇండియా ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో  ఆమె పాల్గొన్నారు.   పంట చేతికి వచ్చే టైంలో  కురిసిన అకాల వర్షాలతో పత్తి, సోయా పంటలకు తీవ్ర నష్టం జరిగిందని ,  బాధిత రైతాంగానికి నష్ట  పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.  

ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తు ప్రధాని నరేంద్ర మోడీ రైతు పక్షపాతి అని,   నూతన వ్యవసాయ విధానం అమల్లోకి తెచ్చి రైతుల కు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పినట్లుగా ఆమె పేర్కొన్నారు.  రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారని ఆమె తెలిపారు.

Related posts

సగం కాలిన కరోనా శవాన్ని పీక్కుతిన్న కుక్కలు

Satyam NEWS

దేవరుప్పల పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

Satyam NEWS

ఎదుర్లంక- యానం బాలయోగి వారధిపై ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

Leave a Comment