33.2 C
Hyderabad
April 26, 2024 00: 52 AM
Slider వరంగల్

తమ పిల్లల ప్రవర్తన, అలవాట్ల పై తల్లిదండ్రులు కన్నేసి వుంచాలి

#drug edict

తమ పిల్లల ప్రవర్తన అలవాట్లు ప్రవర్తనపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి తల్లిదండ్రులకు సూచించారు. టాస్క్ ఫోర్స్ అధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగం పట్ల మీ భవిష్యత్తు పై ఎలాంటి దుష్పరిణామాలు సంభవిస్తాయనే దానిపై వరంగల్ కమిషనరేట్ పరిధిలో గంజాయి సేవిస్తూ పోలీసులకు చిక్కిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ కౌన్సిలింగ్ నిర్వహించారు.

భీమారంలోని శుభం కళ్యాణ మండటంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమములో మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన యువతను సన్మామార్గం పయనించే విధంగా వారిలో మార్పును తీసుకు రావడం ద్వారా నేరాలను నియంత్రణ చేయవచ్చని పోలీస్ కమిషనర్ అలోచన మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కౌన్సిలింగ్ వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా హజరయ్యారు.

ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కావడం ద్వారా తమ బంగారు భవిష్యత్తును కోల్పోవడంతో జరుగుతుందని. ప్రతి యువత జీవితాన్ని సీరియస్ గా తీసుకోని ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలి తప్ప మత్తుకు బానిసలు కావద్దని ఆయన కోరారు.

మత్తుకు బానిసలుగా మారి యువత చిన్న చిట్కాలను పాటించడం ద్వారా చెడు ఆలవాట్లను మార్చుకోవచ్చని. ముఖ్యంగా ప్రతి యువకు ఓ మంచి పౌరుడిగా గుర్తించబడాలని, ముఖ్యంగా మీ ఆలవాట్లతో తల్లిదండ్రులకు మనోవేదన మిగులుతోందని, యువత గంజాయిలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడటం ద్వారా వ్యక్తిగతంగా నష్టపోవడంతో పాటు, ఈ సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నారు.

ముఖ్యంగా నేరాలకు కూడా పాల్పడుతున్నారని. ముఖ్యంగా చట్టప్రకారం గంజాయిని అమ్మడంతో పాటు సేవించడం కూడా నేరమని, కేసులు నమోదు అయితే మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్హత వుందడని, ఆలాగే విదేశాలకు అవసరమయిన పాస్ పోర్టు పోందటం కూడా సాధ్యపడదని ఆయన తెలిపారు.

మత్తు పదార్థాలను సేవించడం నుండి యువత బయటపడాలనుకున్న యువత వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు పూర్తి సహసహాకారం అందజేయడం జరుగుతుందని, ముఖ్యంగా తల్లిదండ్రుల తమ పిల్లలు ఎటు వెళ్ళుతున్నారో, ఎక్కడవున్నారు, ఏం చేస్తున్నారు. వారి మిత్రులు ఏవరు అన్నదానిపై ఎప్పటికప్పుడు అరా తీయాలని సూచించారు.

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు సహకారం అందించాలని, ముఖ్యంగా గంజాయి విక్రయాలకు పాల్పడే వ్యక్తులు సంబంధించిన సమాచారాన్ని పోలీసు అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా వుంచబడుతాయని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.

ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా, టాస్క్ఫ ర్స్ ఏసిపి ప్రతాప్ కుమార్, హన్మకొండ ఏసిపి జితేందర్ రెడ్డి, టాస్క్ఫో ర్స్ ఇన్స్ స్పెక్టర్లు శ్రీనివాజ్, మధు, హెల్పింగ్ హ్యాండ్స్ డీఆడీక్షన్ సెంటర్ ప్రతినిధి డా. రాము, సైకాలజిస్ట్ డా.మనోజ్ తో పాటు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

అంగరంగ వైభవంగా  గణనాథుని శోభాయాత్ర

Satyam NEWS

భూ సమస్యలు గుర్తించండి

Murali Krishna

కులాంతర వివాహం చేసుకున్న వాల్మీకి ఆడబిడ్డపై భౌతిక దాడులు

Bhavani

Leave a Comment