ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ స్కీమ్ హామీలని ప్రకటించారు.. అందులో ఎంతో ప్రధానమైన హామీ తల్లికి వందనం.. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఏటా 15 వేల రూపాయలు ఇస్తానమి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు.. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి.. ఇప్పటికే తాజా బడ్జెట్‌లో ఈ పథకానికి 9407 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది కూటమి సర్కార్.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తక్కువ వ్యవధిలోపే తల్లికి వందనం స్కీమ్ విధి విధానాలను రూపొందించింది.. వైసీపీ సర్కార్ హయాంలో కేవలం కుటుంబానికి ఒక చదువుకునే విద్యార్ధికి మాత్రమే అమ్మ ఒడి పథకాన్ని అందించాడు జగన్.. నాడు ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్క విద్యార్ధికి అని ఊదరగొట్టిన వైసీపీ అధినేత, ఆ తర్వాత మాట తప్పాడు.. మడమ తప్పాడు.. అమ్మ ఒడి కేవలం ఒక విద్యార్ధికే అని రివర్స్ గేర్ వేశాడు.. నాడు నీకు 15, నీకు 15 అని ఫేక్ ప్రచారం చేసిన జగన్ ఆ హామీని నిలబెట్టుకోలేక చతికిలబడ్డాడు.
కానీ, చంద్రబాబు మాత్రం తగ్గేదేలే అని అంటున్నారు.. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా, ప్రతి చదువుకునే విద్యార్ధికి తల్లికి వందనం ఇవ్వాల్సిందే అని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్‌పై ఒత్తిడి తెస్తున్నారు.. ఇటు విద్యా శాఖ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ కూడా ఈ పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు… ఈ పథకం అమలు కోసం ఏకంగా 9వేల కోట్లకుపైగా నిధులు కేటాయించారు… నాడు జగన్ సర్కార్ కేవలం 40 లక్షల పై చిలుకు విద్యార్ధులకి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయగా, నేడు చంద్రబాబు ప్రభుత్వం దాదాపు డబుల్ సంఖ్యలో… సుమారు 78 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం అందిస్తోంది.
నిన్నమొన్నటి వరకు ఈ పథకం అమలుపై వైసీపీ నేతలు ఫేక్ ప్రచారం చేశారు.. చంద్రబాబు మాట ఇచ్చి తప్పారని, ఆయన ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని సోషల్ మీడియాలో ఊదరగొట్టారు.. వీటికి అసెంబ్లీ వేదికగా చెక్ పెట్టారు చంద్రబాబు.. రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం నిధులు తల్లిదండ్రుల అకౌంట్‌లోకి చేరనున్నాయని హామీ ఇచ్చారు.. వైసీపీ ప్రభుత్వంలా తాము ఇచ్చిన మాట తప్పమని కుండబద్దలు కొట్టారు.. వైసీపీ ఇచ్చిన 15వేల రూపాయిలలోనూ రెండు వేల రూపాయలు స్కీల్ బిల్డింగ్ ఫీజులు, నాడు నేడు కోసం కట్ చేశారు.. తాము అలా చేయమని, మొత్తం 15వేల రూపాయలను బదిలీ చేస్తామని ప్రకటించారు చంద్రబాబు.. మొత్తమ్మీద, వైసీపీ ఫేక్ ప్రచారానికి చెక్ పెట్టారు ఏపీ ముఖ్యమంత్రి..